ప్రజాశక్తి-యంత్రాంగం
కంచరపాలెం : జివిఎంసి 57వ వార్డు ఆశివానిపాలెంలో ఎన్‌టిఆర్ చిత్ర పటం వద్ద నివాళులర్పించారు. అనంతరం పార్టీ సీనియర్ మహిళా నాయకులు పబ్బితి రామాయమ్మ, గుండాల భగవతమ్మ, నట్టి జగ్గయమ్మను సత్కరించారు. ఈ కార్యక్రమంలో అల్లాడ శ్రీను, నర్సింగరావు, రేణుక, సోము, మదన్, సంతు, గుత్తల శ్రీను, శంకర్ రెడ్డి పాల్గొన్నారు.
మాధవధార : 51వ వార్డు కార్యాలయంలో మాజీ కార్పొరేటర్ కీర్తిశేషులు సనపల సీతారామాంజనేయలు కుమారుడు సనపల కీర్తి కేకు కట్ చేసి పార్టీ కార్యకర్తలకు అభిమానులకు పంచిపెట్టారు. తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో దవల కుమారి, మూల అప్పారావు, పేడాడ మధుసూదనరావు, బొడ్డేపల్లి లలిత, పేడాడ లలిత జాన్ పాల్గొన్నారు.
50వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వార్డు అధ్యక్షులు సనపల వరప్రసాద్ జెండాను ఎగురవేశారు. అనంతరం కేకు కట్ చేశారు. పలువురు కార్యకర్తలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్తీక్, ఎండ ధాత్రి, సనపల రామచంద్రరావు పాల్గొన్నారు.
మధురవాడ : జివిఎంసి 7వ వార్డు పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఉన్న ఎన్‌టిఆర్ విగ్రహానికి కార్పొరేటర్ పిళ్ళా మంగమ్మ పూలమాల వేసి నివాళులర్పించారు. జెండాను ఎగురవేసి, కేక్ కట్ చేశారు. పలువురు నాయకులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో పిళ్ళా నర్సింగరావు, నాగోతి సూర్యప్రకాష్, పోతిన సోముపాత్రుడు, కానూరి అచ్యుతరావు, పోతిన నాయుడు, పిళ్ళా కృష్ణ, మామిడి దుర్గారావు, నాగోతి అప్పలరాజు, పిస గోవిందరావు, నాగోతి అచ్చారావు, బండయ్య పాల్గొన్నారు.
సీతమ్మధార: 26వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద కార్పొరేటర్ ముక్కా శ్రావణి ఆధ్వర్యాన ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్య్రమంలో ముక్కా ముత్యాల నాయుడు, ముక్కా కిషోర్ కుమార్, పి.లక్ష్మణ పాల్గొన్నారు.
ములగాడ: 41వ వార్డు పరిధి ప్రకాష్ నగర్ ఏడుగుళ్లు వద్ద ఎన్‌టిఆర్ చిత్రపటానికి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు కుమారుడు మౌర్య సింహ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఎగురవేశారు. కేక్ కట్ చేశారు. సీనియర్ కార్యకర్తలను మౌర్య సింహ సన్మానించారు. ఈ కార్యక్రమంలో మజ్జి సోమేష్, పెంటకోట హరికుమార్, నీలాపు జోగి, నక్క లక్ష్మణరావు, జయశంకర్, రాజమణి, సర్వసిద్ధి శ్రీలక్ష్మి, కోరిపిల్లి రాము, ఉరుకోటి డేవిడ్, చైతన్య కుమార్, కామరాజు, దుర్గారావు పాల్గొన్నారు.
సింహాచలం: 98వ వార్డులో మార్కెట్ ప్రధాన కూడలి వద్ద వార్డు అధ్యక్షులు పంచదార శ్రీనివాసరావు పార్టీ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో సతివాడ శంకరరావు, కృష్ణారావు, వెంకటరమణ, బూర్ల కనకరాజు పాల్గొన్నారు.
ఆరిలోవ : ఆరిలోవ పరిధిలోని పలు వార్డుల్లో టిడిపి నాయకులు, కార్యకర్తలు ఎన్‌టిఆర్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఒమ్మి సన్యాసిరావు, కార్పొరేటర్ మద్దిల రామలకీëరాజశేఖర్, గాడు అప్పలనాయుడు, గాడి సత్యం, ఒమ్మి అప్పలరాజు, బుడుమూరు గోవిందు, ఏడువాక సన్యాసిరావు, ముగడ రాజారావు, మూది అప్పారావు, మీసాల సత్తిబాబు, కృష్ణంరాజు, నమ్మి గణేష్, బసవ దేవుళ్ళు పాల్గొన్నారు.
పద్మనాభం : పద్మనాభం జంక్షన్‌లో ఎన్‌టిఆర్ విగ్రహానికి మాజీ మంత్రి ఆర్‌ఎస్‌డిపి అప్పలనర్సింహరాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కె.రమణ, కె.దామోదరరావు, ఎన్.నందేశ్వరరావు, కె.లీలావతి, కె.లక్ష్మి, ఇ.శ్రీరామమూర్తి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్( విశాఖ) : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మహానటుడు ఎన్‌టి రామారావు చిరస్మరణీయులని టిడిపి విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. టిడిపి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం టిడిపి కార్యాలయంలో ఎన్‌టిఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. అనంతరం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ చోడే పట్టాభి, జిల్లా అధ్యక్షుడు వలిశెట్టి తాతాజీ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కృష్ణ పాల్గొన్నారు.
మాడుగుల:పార్టీ ఆవిర్భావం నుండి సేవలు అందిస్తున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలకు ఆ పార్టీ శ్రేణులు బుదవారం మాడుగుల పార్టీ కార్యాలయంలో సన్మానం చేశారు. పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు.సీనియర్ నేతలు వేగి రాంబాబు, తుడుము నూకరాజు, మైనర్ శ్రీను, నేమాల మహాలక్ష్మిలకు సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు పుప్పాల అప్పలరాజు, మండల పార్టీ కార్యదర్శి ఉండూరు దేవుడు, గొల్లవిల్లి శ్రీరామమూర్తి, పుప్పాల రమేష్, బుద్దాల రమణ పాల్గొన్నారు.
గొలుగొండ:తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గొలుగొండ పార్టీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ముందుగా పార్టీ జెండాను తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అడిగర్ల అప్పలనాయుడు ఆవిష్కరించారు. నందమూరి తారక రామరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాల్లు అర్పించారు. కొత్తమల్లంపేట మాజీ సర్పంచ్ చిటికెల సాంబమూర్తి, చోద్యం సహకార సంఘం మాజీ అధ్యక్షులు కొండలరావు, చోద్యం సర్పంచ్ అదపురెడ్డి గోపికృష్ణ, జోగంపేట మాజీ సర్పంచ్ సుర్ల సీతారామమూర్తి, పాత మల్లంపేట సూపర్ సర్పంచ్ గడ్డం ఆనంద్ పాల్గొన్నారు.
కోటవురట్ల:మండల కేంద్రంలో బుధవారం టిడిపి 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ మండల నాయకులు జానకి శ్రీను ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జెండాను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా రాజకీయ చైతన్యం తీసుకువచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పి సూర్యారావు, కొడవటిపూడి ఎంపీటీసీ సూర్యప్రకాష్, టిడిపి పట్టణ అధ్యక్షులు కసిరెడ్డి ఏసుబాబు, జానకి హరి, తంగేటి శ్రీనివాసరావు, సుంకర బాబ్జి పాల్గొన్నారు.
టిడిపి ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే వేచలపు శ్రీరామమూర్తి ఇంటి వద్ద శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీరామమూర్తి, బికేపల్లి సర్పంచ్ లింగన్ననాయుడు, మాజీ సర్పంచ్ చిటికెల సత్యనారాయణ, మండలం తెలుగు యువత అధ్యక్షులు తిరుమలరావు పాల్గొన్నారు.
అనకాపల్లి:తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడిన మహానేత ఎన్‌టి రామారావు అని టిడిపి పట్టణ అధ్యక్షులు డాక్టర్ కెకెవిఎ నారాయణరావు అన్నారు. స్థానిక రింగ్ రోడ్‌లోని టిడిపి కార్యాలయం వద్ద టిడిపి 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా 12 మంది సీనియర్ కార్యకర్తలను సత్కరించి మిఠాయిలు పంచిపెట్టారు. స్థానిక ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి టిడిపి నాయకులు మాదంశెట్టి నీలబాబు, సబ్బవరపు గణేష్, పూలమాలలు వేసి నివాళులర్పించారు.
యలమంచిలి : స్థానిక మెయిన్ రోడ్డులోని టిడిపి కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించి, పార్టీ జెండాను ఆవిష్కరించారు. టిడిపి నాయకులు గొర్లె శివనారాయణ, రమణబాబు, కొఠారు సాంబ, ఆర్‌ఎస్ నాగేశ్వరరావు పాల్గొన్నారు.
కశింకోట : స్థానిక మెయిన్ రోడ్డులోని నందమూరి తారకరామారావు- బసవ తారకం విగ్రహాలకు టిడిపి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఓమ్మి కోటేశ్వరరావు, రాజును సన్మానించారు. నాయకులు మురళి, రమణమూర్తి, శ్రీనివాసరావు, పాల్గొన్నారు
పరవాడ : పరవాడ సంతబయలు వద్ద ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి మాజీ మంత్రి బండారు సత్యన్నారాయణ మూర్తి పూలమాల వేసి, పార్టీ జెండాను ఆవిష్కరించారు. టిడిపి నాయకులు వియ్యపు చిన్నా, పైలా జగన్నాధరావు పాల్గొన్నారు. వార్డు కార్పొరేటర్ రౌతు శ్రీనివాస్ లంకెలపాలెం జంక్షన్‌లో పతాక ఆవిష్కరణ చేశారు.
మునగపాక రూరల్ : మునగపాక మెయిన్ రోడ్‌లో గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పార్టీ జెండాను ఎగురవేశారు. నలుగురు పార్టీ సీనియర్ నాయకులను సత్కరించారు. నాయకులు ముసలి నాయుడు, ఆడారి మంజు పాల్గొన్నారు.
సబ్బవరం : స్థానిక ఎన్టీఆర్ జంక్షన్‌లో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి కేక్‌ను కట్ చేశారు. ఎన్టీఆర్ నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు మిడతాడ మహాలక్ష్మి నాయుడు, గండి రవి కుమార్, ముత్యాల నాయుడు పాల్గొన్నారు.
కె.కోటపాడు : కింతాడ పంచాయతీ శివారు కూండ్రపువానిపాలెం గ్రామంలో పార్టీ జెండాను నాయకులు ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కన్నూరు సూర్యనారాయణ, కశిరెడ్డి అప్పలనాయుడు, బత్తి వెంకటరమణ పాల్గొన్నారు.
దేవరాపల్లి : మండల కేంద్రంలో పార్టీ సీనియర్ నాయకులు ఎల్లేటి కరుణాకర రావు నివాసం వద్ద పార్టీ జెండా ఎగరవేసి సంబరాలు నిర్వహించారు. ఎన్‌టిఆర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. పార్టీ నాయకులు రామ్ పూరి, ఆదిరెడ్డి అక్కుతాతను సన్మానించారు.
బుచ్చయ్యపేట : దిబ్బిడి, రాజాం గ్రామాలలో తెలుగుదేశం పార్టీ జెండాలను ఆవిష్కరించి, ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టిడిపి నాయకులు గోకవాడ కోటేశ్వరరావు అప్పలనాయుడు, వియ్యపు అప్పారావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఉప్పవరంలో...
అచ్యుతాపురం : టిడిపి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం ఉప్పవరం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి ఆ పార్టీ మండల నాయకుడు కూనిశెట్టి సత్తిబాబు పూలమాల వేసి నివాళులర్పించారు. టిడిపి రాష్ట్ర కార్యదర్శి రాజాన రమేష్ కుమార్ రాజానపాలెం గ్రామంలో పార్టీ జండా ఎగరవేశారు. పూడిమడక, మోసయ్యపేటలోనూ కార్యక్రమాలు జరిగాయి.










