Nov 11,2023 23:12

ప్రజాశక్తి-యంత్రాంగం
జిల్లాలో పలుచోట్ల టిడిపి ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు కార్యక్రమం శనివారం నిర్వహించారు.
కరప వైసిపి పాలకులు ప్రజల సమస్యలను గాలికివదిలేశారని, అవినీతి, అక్రమాలు, అరాచకాలే తప్పా చేసిన అభివద్ధి శూన్యమనిరూరల్‌ మాజీ ఎంఎల్‌ఎ పిల్లి అనంతలక్ష్మి, టిడిపి రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్య నారాయణమూర్తి విమర్శించారు. శనివారం మండలంలోని ఉప్పలంక గ్రామంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని టిడిపి-జనసేన పార్టీల నాయకులతో కలిసి నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి టిడిపి, జనసేన అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలపై విస్తత ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో పరిశీలికులు కుడిపూడి సత్తిబాబు, మాజీ ఎంపిపి గుల్లిపల్లి శ్రీనివాసరావు, మాజీ జెడ్‌పిటిసి సభ్యుడు బుంగా సింహాద్రి, జనసేన రాష్ట్ర కార్యదర్శి పొలసపల్లి సరోజ, క్లస్టర్‌ ఇన్చార్జిలు గండి వెంకటేశ్వరరావు, షేర్‌ నూకరాజు, మల్లాడి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. యు.కొత్తపల్లి జగన్‌ పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానంటుతున్నాయని పిఠాపురం మాజీ ఎంఎల్‌ఎ వర్మ అన్నారు శనివారం వర్మ అధ్యక్షతన బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, మన ఇంటికి మన వర్మ ఆశీర్వదిద్దాం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప్పాడ గ్రామంలో నాయకర్‌ కాలనీ, కొత్తపట్నం గ్రామాల్లో పార్టీ శ్రేణులతో కలిసి వర్మ ఇంటింటికీ తిరిగి సూపర్‌ సిక్స్‌ పథకాలు వివరించారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ జగన్‌ పాలనలో నిత్యావసర, విద్యుత్‌ ఛార్జీలు భాదుడు, పెరిగిన వంట గ్యాస్‌, అన్ని రంగాలు, వర్గాలు వారిని ఇబ్బందులకు ఎలా గురి చేశారో అవన్నీ వివరించారు. కార్యక్రమంలో మత్స్యకార నాయకులు, గ్రామ టిడిపి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జగ్గంపేట రూరల్‌ మండలంలోని గుర్రంపాలెం గ్రామంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ సంతకం పెట్టిన ప్రమాణ పత్రాలను జగ్గంపేట మాజీ ఎంఎల్‌ఎ జ్యోతుల నెహ్రూ పంపిణీ చేశారు. అనంతరం గ్రామ మాజీ సర్పంచ్‌, టిడిపి సీనియర్‌ నాయకులు పడాల ధర్మరాజు ఇటీవలే గుండెకు స్టంట్‌ వేయించుకోవడంతో ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు మారిశెట్టి భద్రం, గుర్రంపాలెం మాజీ ఎంపిటిసి సభ్యులు పడాల ఈశ్వరరావు, షేక్‌ వల్లి, గ్రామ టిడిపి ప్రధాన కార్యదర్శి పడాల బాలాజీ, జగ్గంపేట కో-ఆపరేటివ్‌ రూరల్‌ బ్యాంకు మాజీ డైరెక్టర్‌ కూసుమంచి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.