
ప్రజాశక్తి-అనకాపల్లి
రక్షాబంధన్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు బుధవారం జీవీఎంసీ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు, మహిళా ఉపాధ్యాకయులు రాఖీలు కట్టి తమ సోదర భావాలను చాటుకున్నారు. చిన్నారులు రాఖీ ఆకారంలో కూర్చుని మంత్రి అమర్నాథ్‌కు స్వాగతం పలికారు.
యలమంచిలి : స్థానిక బ్రహ్మకుమారీస్ ఇన్‌ఛార్జి బికె.దేవి ఆధ్వర్యాన పట్టణంలోని ప్రముఖులను కలిసి విజయ తిలకం దిద్ది రాఖీలు కట్టారు. రాఖీ కట్టించుకున్న వారిలో తహశీల్దార్ రాణీ అమ్మాజీ, ఎంపిపి బోదెపు గోవిందరావు, ఎంపిడిఓ అప్పలనాయుడు, ఎస్బీఐ బ్యాంకు మేనేజరు రవికుమార్, ఎల్‌ఐసి బ్రాంచి మేనేజరు రాంబాబు, ఆసుపత్రి సూపరింటెండెంట్ సుభాష్ ఉన్నారు.
గోపాలపట్నం : రక్షా బంధన్‌ను పురస్కరించుకొని 89వ వార్డు వైసిపి కార్యాలయంలో పశ్చిమనియోజకవర్గ పార్టీ సమన్వయకర్త ఆడారి ఆనంద్‌కుమార్‌కు, వార్డు అధ్యక్షులు అయితంశెట్టి రేణుకగోపాలకృష్ణకు, నాయకులు ఆళ్ల పైడిరాజుకు వార్డు ఆర్‌పిలు, అక్కాచెల్లెమ్మలు రాఖీలు కట్టారు. విరాట్‌నగర్ బ్రహ్మకుమారి ఆశ్రమం ఇన్‌ఛార్జి బికె జ్యోతి జివిఎంసి కో-ఆప్షన్ సభ్యులు బెహరా భాస్కరరావుకు ఆయన స్వగృహంలో రాఖీ కట్టారు.
భీమునిపట్నం : స్థానిక ఎస్‌ఒఎస్ చిల్డ్రన్స్ విలేజ్ కుటుంబ బలోపేత లబ్ధిదారుల పిల్లలకు జిల్లా రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్.శ్రీనివాసమూర్తి బుధవారం రాఖీలను కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ బలోపేత కార్యక్రమం మేనేజర్ కర్రోతు దుర్గరాజు, కో-ఆర్డినేటర్ వి.సత్యనారాయణ, యానిమేటర్లు సరళ, అప్పలకొండ పాల్గొన్నారు.
విశాఖపట్నం : ఆంధ్రవిశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య పివిజిడి.ప్రసాదరెడ్డికి బ్రహ్మకుమారీలు రాఖీ కట్టారు. అనంతరం వీసీ కార్యాలయ సిబ్బందికి కూడా రాఖీలు కట్టారు.
విశాఖ కలెక్టరేట్ : తెలుగుదేశం పార్టీ మహిళా పక్షపాతి అని, మహిళా సాధికారత ఈ పార్టీతోనే సాధ్యమని టిడిపి విశాఖ పార్లమెంట్ ఇన్‌ఛార్జి ఎం.శ్రీ భరత్ అన్నారు. బుధవారం రక్షాబంధన్ సందర్భంగా బీచ్ రోడ్‌లోని ఆయన కార్యాలయానికి మహిళలు పెద్ద ఎత్తున వచ్చి ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు నిర్వహించారు.
రక్షాబంధన్ వేడుకలు సోదర భావానికి ప్రతీకగా నిలుస్తాయని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అన్నారు. బుధవారం విజెఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో రక్షా బంధన్ వేడుకలు నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా ఆమె హాజరై మాట్లాడారు. సింహచలం దేవస్ధానం ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు, బ్రహ్మకుమారీస్ ప్రతినిధి రామేశ్వరి, జివిఎంసి అదనపు కమిషనర్ యాదగిరి శ్రీనివాస్, ఎపి పవర్ డిప్లొమో ఇంజినీర్స్ రాష్ట్ర అధ్యక్షులు మహేశ్వరరెడ్డి, సీనియర్ పాత్రికేయులు ఆర్.నాగరాజు పట్నాయక్ పాల్గొన్నారు.