
ప్రజాశక్తి- గొలుగొండ: మండలంలో ఏఎల్ పురం అల్లూరి పార్కులో 23వ సంవత్సరం క్రితం పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ కలయికను ఆదివారం నిర్వహించుకున్నారు. పూర్వ విద్యార్థు లంతా పలకరించుకొని గత స్మతులను నెమరు వేసుకున్నారు. ఆనాటి ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాతిరెడ్డి రామకష్ణ, అంబటి వరహాల బాబు, గొంతిన తాతాజీ, గొంతిన నర్సింగరావు, ముచ్చకర్ల నర్సింగరావు, తోకల సంతోష్ కుమార్, దుంపలపూడి శివ పాల్గొన్నారు.
ఎస్.రాయవరం:మన తోటి వారికి ఆపన్న హస్తం అందిద్దామని పూర్వ విద్యార్ధులు పిలుపునిచ్చారు. కొరుప్రోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1975-80 సంవత్సరంలో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్ధులు ఆదివారం సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు.కొరుప్రోలు గ్రామానికి చెందిన కోరా రామారావు, పెదఉప్పలం గ్రామానికి చెందిన జయరావు, వైసిహెచ్ ప్రసాద్, యం కె యమ్ గుప్తాల నేతృత్వంలో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఆనాడు తమను తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. పాఠశాలకు తమవంతు అండగా నిలవడంతో పాటు తోటి వారికి ఆపన్నహస్తం అందిద్దామని నిర్ణయించారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. కష్టసుఖాలలో పాలు పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పటి ఉపాధ్యాయులు చెల్లూరి భాస్కరరావు, వ్యాయామ ఉపాధ్యాయుడు భీమరాజు పాల్గొన్నారు.