ప్రజాశక్తి - యంత్రాంగం
ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్రను పూర్తి చేసి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఆదివారం వేడుకలు నిర్వహించారు. వైఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఎంవిపి.కాలనీ : వైసిపి జిల్లా కార్యాలయంలో పార్టీ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల అధ్యక్షతన వేడుకలు జరిగాయి. ప్రజా సంకల్పయాత్ర వేడుకలకు ఎంపీ ఎంవివి.సత్యనారాయణ, విశాఖ నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, జిల్లా పరిషత్ చైర్మన్ సుభద్ర, శాసనసభ్యులు నాగిరెడ్డి, శాసన మండలి సభ్యులు వరుదు కల్యాణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాజశేఖరరెడ్డి ప్రజాప్రస్థానం యాత్రలోనూ, జగన్మోహన్‌రెడ్డి ఓదార్పు యాత్రలోనూ, షర్మిల పాదయాత్రలోనూ, ప్రజా సంకల్ప యాత్రలోనూ పాల్గొన్న అతి కొద్ది మందిలో ఒకరైన తిప్పల నాగిరెడ్డిని సత్కరించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అదనపు కార్యదర్శి రవి రెడ్డి, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు జాన్ వెస్లీ, కోలా గురువులు, పిల్లా సుజాత, పిల్లి సుజాత, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు యువశ్రీ, విజయచందర్, పార్టీ నాయకులు కంపా హనోక్, వుడా రవి, ద్రోణంరాజు శ్రీవాత్సవ, వివిధ వార్డుల కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.
భీమునిపట్నం : స్థానిక వైసిపి కార్యాలయంలో పార్టీ నియోజక వర్గ ఇన్‌ఛార్జి ముత్తంశెట్టి మహేష్ ఆధ్వర్యాన వైఎస్.రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి సభ్యులు గాడు వెంకటప్పడు, నాలుగో వార్డు కార్పొరేటర్ దౌలపల్లి కొండబాబు, పిఎసిఎస్ అధ్యక్షులు అక్కరమాని రామునాయుడు పాల్గొన్నారు.
సీతమ్మధార : ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకె.రాజు ఆధ్వర్యాన పార్టీ కార్యాలయంలో వైఎస్‌ఆర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం జగన్మోహన్‌రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్, కంపా హనుక్, అల్లు శంకరరావు, కార్పొరేటర్లు కె.అనీల్‌కుమార్ రాజు, సాడి పద్మరెడ్డి, ఆళ్ళ లీలావతిశ్రీనివాస్, కంటిపాము కామేశ్వరి, రెయ్యి వెంకటరమణ, శశికళ, కో-ఆప్షన్ సభ్యులు సేనాపతి అప్పారావు, మాజీ కార్పొరేటర్లు కె.వెంగళరావు, వార్డు ఇన్‌ఛార్జులు పైడి రమణ, నీలి రవి, జివి.రమణి, పెడాడ రమణికుమారి, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆనందపురం : ఆనందపురం కూడలిలో రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైసిపి ఇన్‌ఛార్జి ముత్తంశెట్టి మహేష్, సిఇసి మెంబర్ కాకర్లపూడి శ్రీకాంత్, మండల పార్టీ అధ్యక్షుడు బంక సత్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ మజ్జి వెంకట్రావు, కోరాడ అప్పలస్వామినాయుడు, రౌతు శ్రీను తదితరులు పాల్గొన్నారు.










