Nov 15,2023 00:20

కార్యక్రమంలో పాల్గొన్న వైసిపి ఉత్తర సమన్వయకర్త కెకె.రాజు

ప్రజాశక్తి - ఆరిలోవ : జివిఎంసి 13వ వార్డు కార్పొరేటర్‌ కెల్ల సునీత ఆధ్వర్యాన ఆరిలోవ కాలనీ ఎస్‌కెఎంఎల్‌ నగర్‌లో మంగళవారం ఆంధ్రప్రదేశ్‌కు జగన్‌ ఎందుకు కావాలంటే కార్యక్రమం నిర్వహించారు. తూర్పు నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త, ఎంపీ ఎంవివి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల వివరాల బోర్డును సచివాలయ పరిధిలో ప్రదర్శించారు. వైసిపి జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్టు డైరెక్టర్‌ వనం వరలక్ష్మి, వాణిజ్య విభాగం అధ్యక్షులు వానపల్లి ఈశ్వరరావు, వైసిపి నాయకులు విక్టర్‌ తదితరులు పాల్గొన్నారు.
సీతమ్మధార : జివిఎంసి 44వ వార్డు పరిధి ఎంటిసి పాలెం సచివాలయ పరిధిలో ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలంటే... కార్యక్రమాన్ని వైసిపి ఫ్లోర్‌ లీడర్‌ బాణాల శ్రీనివాసరావు ఆధ్వర్యాన నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఉత్తర నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త కెకె.రాజు హాజరై మాట్లాడారు. సచివాలయం పరిధిలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం అభివృద్ధి పనులు వివరాలతో కూడిన బోర్డును ప్రారంభించారు. అనంతరం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బులుసు జగదీశ్‌, ఆళ్ల శివ గణేష్‌, హాబీబ్‌, హీరా, ముస్తఫా, బసీర్‌, జ్యోతి, సీతారాములు, సుధాకర్‌ రెడ్డి, ప్రసాద్‌, పి.గోపి, ఎం.గోపి పాల్గొన్నారు.
నర్సీపట్నం టౌన్‌ : ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ కోరారు. మంగళవారం మున్సిపాలిటీలోని 15వ సచివాలయంలో ఎపిీకి జగనే ఎందుకు కావాలి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంక్షేమం ప్రగతి డిజిటల్‌ బోర్డును ఆవిష్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్శన్‌ బోడపాటి సుబ్బలక్ష్మీ, వార్డు కౌన్సిలర్‌ మాకిరెడ్డి బుల్లిదొర, వైసిపి పట్టణ అధ్యక్షులు ఏకా శివ, వార్డు ఇన్‌చార్జ్‌ మురళీకృష్ణ, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
కోటవురట్ల : మండలంలోని అన్నవరం సచివాలయంలో మంగళవారం స్థానిక సర్పంచ్‌ సుబ్బలక్ష్మి ఆధ్వర్యంలో ఎపికి జగనన్న ఎందుకు కావాలంటే కార్యక్రమం నిర్వహించారు ఈసందర్భంగా గ్రామంలో చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ఆవిష్కరించారు, కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ దత్తుడు రాజు, ఎంపిడిఒ కాశీ విశ్వనాథరావు, ఎంపిటిసి ఎర్రన్నాయుడు, కార్యదర్శి స్వామినాయుడు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
కశింకోట : మండల కేంద్రంలోని సచివాలయం-2 పరిధిలో ఎపికి జగన్‌ ఎందుకు కావాలి అనే కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఎంపిపి కలగా లక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేయడం జగన్‌ మోహన్‌ రెడ్డికే సాధ్యమన్నారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు మలసాల కిషోర్‌, కలగా గున్నయ్యనాయుడు, వైస్‌ ఎంపీపీ పెంటకోట జ్యోతి శ్రీనివాస్‌రావు, నమ్మి మీనా గణేష్‌, సర్పంచ్‌ మంత్రి జయ రంజని బెంజిమెన్‌ పాల్గొన్నారు.
అచ్యుతాపురం : వైసీపీ ప్రభుత్వంతోనే పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయని వైసిపి మండల శాఖ అధ్యక్షులు దేశంశెట్టి శంకర్రావు అన్నారు. మండలంలోని దుప్పుతూరు సచివాలయంలో మంగళవారం ఏపీకి జగన్‌ ఎందుకు కావాలి అనే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వైసిపి జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యులు రాంబాబు, నర్మాల కుమార్‌, అచ్చుతాపురం గ్రామ సర్పంచ్‌ కె విమల నాయుడు, వైసిపి నాయకులు కోన బుజ్జి, పి వాసు రాజు, జి అశ్విని నూకరాజు, ఎంపీడీవో విజయలక్ష్మి, పరిపాలన అధికారి డి కృష్ణ పాల్గొన్నారు.