
ప్రజాశక్తి-యంత్రాంగం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సిఎం వైఎస్.జగన్ మళ్లీ రావాలంటూ వైసిపి గురువారం పలు చోట్ల 'మళ్లీ జగనే ఎందుకంటే' కార్యక్రమం చేపట్టారు. రామచంద్రపురం హసన్‌బాద గ్రామానికి అందిన సంక్షేమ పథకాలపై ఏర్పాటు చేసిన బోర్డ్‌ను ఎంపిపి అంబటి భవాని ఆవిష్కరించారు. గ్రామ సర్పంచ్ నాగిరెడ్డి సతీష్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి మేర్నేడి వెంకటేశ్వరరావు, వాసంశెట్టి శ్యామ్, ద్రాక్షారామ సర్పంచ్ కొత్తపల్లి అరుణ, ఎంపిడిఒ కీర్తి స్పందన, ఇఒపిఆర్‌డి ఎన్.సెలట్‌రాజు, సెక్రటరీ వలివేటి సుబ్రహ్మణ్యం, విఆర్‌ఒ సూర్యకుమారి పాల్గొన్నారు. కాట్రేనికోన మండలం శివారు పోర, నడవపల్లి, పల్లిపాలెంలో ఎంఎల్‌ఎ పొన్నాడ వెంకట సతీష్ కుమార్‌కు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఏడిద చక్రపాణిరావు, ఎంపిపి పాలేపు లక్ష్మీధర్మారావు, జెడ్‌పిటిసి నేల కిషోర్ కుమార్, మండల అధ్యక్షుడు నల్లా నరసింహ మూర్తి, జిల్లా వైసిపి ఉపాధ్యక్షుడు మండల అర్‌బికె చైర్మన్ నాతి సత్యనారాయణ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాశి హనుమంతరావు, వైస్ ఎంపిపి సానబోయిన నాగేశ్వరరావు, సర్పంచులు మల్లాడి బాబ్జి, నాతి అలివేణి, వంక ఏడుకొండలు, దొమ్మేటి పల్లవి, నాయకులు దాసరి కాసుబాబు పాల్గొన్నారు. ఆలమూరు మడికి పంచాయతీ వద్ద వైసిపి మండల కన్వీనర్, చెముడులంక సర్పంచ్ తమ్మన శ్రీనివాస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఎంపిపి తోరాటి లక్ష్మణరావు, జెడ్‌పిటిసి తోరాటి సీతామహాలక్ష్మి రాంబాబు, సర్పంచ్ ఉండ్రాజపు లక్ష్మి మౌనిక చిన్న, ఉప సర్పంచ్ పడమటి సుజాత, పడమటి రాంబాబు, మల్లిమొగ్గల చిన్న పాల్గొన్నారు. ఉప్పలగుప్తం సచివాలయంలో మంత్రి పినిపే విశ్వరూప్ తనయుడు డాక్టర్ శ్రీకాంత్ సంక్షేమ అభివృద్ధి, పథకాల బోర్డును ఆవిష్కరించారు. జెడ్‌పిటిసి గెడ్డం సంపదరావు, కడిమి చిన్నవరాజు, వైసిపి మండల అధ్యక్షుడు బద్రి బాబ్జి, చీకట్ల కిషోర్, కొటుం లోవరాజు, పెయ్యల రమణ, చిక్కం బాలయ్య, ఓగూరి విజయకుమార్, యనమదల పల్లంరాజు, ఎంపిడిఒ, కెవి.ప్రసాద్, ఇఒపిఆర్‌డి కెఎస్.గౌరీకుమారి పాల్గొన్నారు. మండపేట మండలం కేశవరంలో సర్పంచ్ పెదపాటి సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఎంపిపి ఉండమట్ల వాసు, ఆర్‌బికెల చైర్మన్ అన్నందేవుల చంద్రరావు, ఎపిటిసి అన్నందేవుల కృష్ణ వైసిపి జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కొప్పిరెడ్డి ప్రసాద్, బందెల సాయిరామ్, అల్లంపల్లి కిశోర్, గండిమేను గోవింద్, ఉండమట్ల హరి, పలుకూరి వెంకన్నబాబు, విన్నకోట ప్రసాద్, ఉండమట్ల వీరేంద్ర, చంద్రమళ్ల యేసయ్య, సలాది శివ, ఉండమట్ల నారాయుడు, కూసు అబ్బు, ముక్కపాటి పనస, రాయపాటి సత్యనారాయణ, పురంశెట్టి శ్రీను, కూసు అమ్మన్న, నున్న రాంబాబు, ఎలుగుబంటి సుబ్బారావు, రాంబాబు, అరవ సూరిబాబు, చంద్రమళ్ల పోతురాజు పాల్గొన్నారు. మామిడికుదురు వైసిపి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు సూరిశెట్టి బాబీ మగటపల్లి పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. సర్పంచ్ సూరిశెట్టి లక్ష్మీ చంటిబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఎ రాపాక వరప్రసాద్ తనయుడు వెంకటరామ్ అభివృద్ధి బోర్డును ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భూపతిరాజు సత్తిబాబురాజు, జెడ్‌పిటిసి కె.అంజిబాబు, ఎఎంసి చైర్మన్ గుబ్బల రోజా రమణి, బొలిశెట్టి భగవాన్ పాల్గొన్నారు. ఆత్రేయపురం మెర్లపాలెంలో నిర్వహించిన కార్యక్రమంలో జెడ్‌పిటిసి బోనం సాయిబాబా, ఆప్కా చైర్మన్ కప్పల శ్రీధర్, ఎంపిడిఓ నాతి బుజ్జి, ఎఒపిఆర్‌డి శ్రీనివాసరావు మాట్లాడారు. వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్ కనుమూరు శ్రీనివాసరాజు, ముదునూరి రామరాజు, జంపన సుబ్బరాజు, త్రిమూర్తులు, గంటి నాగేశ్వరరావు, నార్కెడిమిల్లి సర్పంచ్ పాలా నాగేశ్వరరావు, కొల్లి శామ్‌సన్, పంచాయితీ కార్యదర్శి, వై.విజరు తదితరులు పాల్గొన్నారు.