ప్రజాశక్తి-యంత్రాంగం
జిల్లాలో పలుచోట్ల జగనన్న ఆరోగ్య సురక్షలో భాగంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఈ వైద్యశిబిరాలు కొనసాగాయి.
మండపేట పేదల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని వైస్ ఎంపిపి పసుమర్తి నాగేశ్వరరావు, వైసిపి రాష్ట్ర నాయకులు దూలం వెంకన్నబాబు అన్నారు. ఏడిద గ్రామంలో జెడ్‌పి ఉన్నత పాఠశాల్లో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని వారు ప్రారంభించారు. శిబిరంలో ప్రత్యేక వైద్య నిపుణులు 200 మందికి వైద్యసేవలు అందించారు. ఐసిడిఎస్ ఆధ్వర్యంలో గర్బిణులకు సామూహిక శీమంతాలు నిర్వహించి పౌష్టికాహార కిట్లు అందజేశారు. కార్యక్రమంలో పంచాయతీ మెంబర్ చిలుకూరి బుజ్జి, సొసైటీ ఛైర్మన్ రామిశెట్టి శ్రీహరిబాబు, మండల అభివృద్ధి అధికారి ఐదం రాజు, తహశీల్దార్ టిఆర్. రాజేశ్వరరావు, ఎంఇఒ నాయుడు రామచంద్రరావు, వైసిపి జిల్లా కార్యదర్శి వల్లూరి రామకృష్ణ, ఎఎంసి డైరెక్టర్ పలివెల సుధాకర తదితరులు పాల్గొన్నారు. కాట్రేనికోన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పల్లంకుర్రు సర్పంచ్ నాతి అలివేణి అన్నారు. పల్లంకుర్రు పంచాయతీ పరిధిలోని సచివాలయం-3కు సంబంధించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ అలివేణి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. కార్యక్రమం ఆవశ్యకతను ఆర్‌బికెల చైర్మన్ నాతి సత్యనారాయణ ప్రజలకు వివరించారు. అనంతం వైద్య శిబిరంలో డాక్టర్ బి.స్వాతి ఆధ్వర్యంలోని వైద్య బందం ప్రజలకు పరీక్షలు నిర్వహించారు. ఐసిడిఎస్ సూపర్‌వైజర్ల ఆధ్వర్యంలో పౌష్టి కాహారంతో కూడిన 60 రకిత వంటలను తయారు చేసి శిబిరంలో ప్రదర్శన కు ఉంచారు. పోషకాహార వంటకాలను అధికారులు ప్రజాప్రతినిధులు పరిశీలించారు. కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్ నల్ల నరసింహమూర్తి, తహశీల్దార్ సత్యనారాయణ, ఎంపిడిఒ కె.కామేశ్వరరావు, డిటి ఝాన్సీ, డాక్టర్ బి. స్వాతి, ఎంపిటిసి సభుయలు జిటి, ఐసిడిఎస్ సూపర్‌వైజర్లు రమణి, జయవాని, పంచాయతీ కార్యదర్శి పోలిశెట్టి రామారావు, జగడం వెంకట రమణ, జానిపల్లి శ్రీను, అంగన్‌వాడీ, సచివాలయ సిబ్బంది వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ఆత్రేయపురం వాడపల్లి గ్రామంలో సర్పంచ్ పి.బాబురావు ఆధ్వర్యంలో జరిగిన మెగా వైద్య శిబిరం జరిగింది. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ డివిఎన్.అనిల్ కుమార్, మండల పంచాయతీ విస్తరణ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అమలాపురం రూరల్ పేరూరు కొంకాపల్లి 4 వ సచివాలయం పరిదిలో సర్పంచ్ దాసరి అరుణ అధ్యక్షతన జగనన్న అరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో అమలాపురం ఎంపిపి కుడుపూడి భాగ్యలక్ష్మి, జెడ్‌పిటిసి సభ్యుడు పందిరి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ఉప్పలగుప్తం నంగవరం సచివాలయంలో నంగవరం-సన్నవిల్లి గ్రామాల ప్రజలకు స్థానిక సర్పంచ్, డాక్టర్ వైఎస్‌ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ బోర్డు సభ్యులు జిన్నూరి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని నిర్వహించారు. శిబిరాన్ని ఎంపిటిసి వంగా గిరిజాకుమారి ప్రారంభించారు. వైద్యాధికారి ఎల్.నాగార్జున రోగులను పరీక్షించారు. కార్యక్రమంలో సన్నవిల్లి సర్పంచ్ చిక్కం పెదబాబు, మాజీ సర్పంచ్ శీలం సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. కపిలేశ్వరపురం గ్రామాల్లో నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలను ప్రజలంతా సద్వినియోగం చేసుకుని ఆరోగ్యవంతంగా ఉండాలని ఎంపిపి మేడిశెట్టి సత్యవేణి, జెడ్‌పిటిసి సభ్యుడు పుట్టపూడి వీర వెంకట సూర్యనారాయణ అన్నారు. వల్లూరు జెడ్‌పి ఉన్నత పాఠశాల ఆవరణలో గ్రామ సర్పంచ్ దాసి మీనా కుమారి ఈశ్వరరావు, అధ్యక్షతన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపిడిఒ ఎం.రామకష్ణారెడ్డి, తహశీల్దార్ కె.సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.










