Oct 13,2023 23:24

ప్రజాశక్తి-యంత్రాంగం
జిల్లాలో శుక్రవారం నిర్వహించిన జగనన్న ఆరోగ్యసురక్ష కార్యక్రమంలో భాగంగా పలుచోట్ల వైద్యశిబిరాలు కొనసాగాయి.
మామిడికుదురు ప్రతి ఇంట ఆరోగ్యవంత సమాజం ఉండాలనే సంకల్పంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నామని పి.గన్నవరం ఎంఎల్‌ఎ కొండేటి చిట్టిబాబు అన్నారు. పాశర్లపూడి - 2 సచివాలయంలో సర్పంచ్‌ సర్పంచ్‌ కొనుజు ప్రేమజ్యోతి ఆద్వర్యంలో శుక్రవారం హైస్కూల్‌ లో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ కె.వెంకటేశ్వరరావు, డిప్యూటీ తహశీల్దార్‌ శరణ్య, పరిపాలనాధికారి కారుపల్లి వెంకటేశ్వరరావు, ఇఒపిఆర్‌డి అడబాల శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్‌ కొనుకు నాగరాజు, ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఆలమూరు జొన్నాడలో 'జగనన్న ఆరోగ్య సురక్ష'లో సర్పంచ్‌ కట్టా శ్రీనివాస్‌, ఉప సర్పంచ్‌ నాండ్ర నాగమోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు ఉత్తమ పౌష్టికాహార ప్రదర్శన ఏర్పాటుచేశారు. ఎంపిడిఒ కె.జాన్‌ లింకన్‌, ఇఒపిఆర్‌డి రాజ్‌ కుమార్‌, ఎపిఎం ఎం.ధనరాజు, వైద్యాధికారులు డాక్టర్‌ పి.భవాని శంకర్‌, డాక్టర్‌ సువర్చల, డాక్టర్‌ ప్రసన్న, డాక్టర్‌ మౌళి, డాక్టర్‌ శ్రీలక్ష్మి పౌష్టికాహార ప్రదర్శనను పరిశీలించి సంతప్తిని వ్యక్తం చేశారు. అనంతరం వారి పర్యవేక్షణలో సుమారు 500 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచిత మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి నేత రామకష్ణ, బి.శ్రీనివాసరావు, తాడి శ్యాం రెడ్డి, కార్యదర్శి సిహెచ్‌.వీరమాత, కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ రాధాకష్ణ, సూపర్వైజర్లు శివప్రసాద్‌, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మండపేట మండలంలోని మారేడుబాకలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం శుక్రవారం జరిగింది. మున్సిపల్‌ చైర్మన్‌ పతివాడ నూక దుర్గారాణి,వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దూలం వెంకన్నబాబులు మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్షా కార్యక్రమం పేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ మట్టపర్తి గోవిందరాజు అధికారులు తదితరులు పాల్గొన్నారు. అమలాపురం రూరల్‌ పేరూరు గ్రామం తోట్లపాలెం వద్ద గ్రామ సర్పంచ్‌ దాసరి అరుణ డేవిడ్‌ అధ్యక్షతన నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని ఏఎంసి చైర్‌ పర్సన్‌ దంగేటి డోలామణి రుద్ర ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపిపి కుడిపూడి భాగ్యలక్ష్మి, ఉప సర్పంచ్‌ కుడిపూడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అయినవిల్లి అయినవిల్లి లంక గ్రామంలోప్రభుత్వం ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపును ఎంఎల్‌ఎ కొండేటి చిట్టిబాబు ప్రారంభించారు. ఐసిడిఎస్‌ వారు ఏర్పాటు చేసిన పోషకార స్టాల్‌ను పరిశీలించి సంతప్తి వ్యక్తం చేశారు ఈ వైద్య శిబిరంలో 605 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. స్థానిక సర్పంచ్‌ కుమ్మరి మాధవి లత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపిపి మట్టపర్తి నాగ విజయలక్ష్మి, జెడ్‌పిటిసి సభ్యుడు గన్నవరపు శ్రీనివాసరావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆత్రేయపురం పులిదిండి గ్రామంలో సర్పంచ్‌ అధ్యక్షతన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమాన్ని జెడ్‌పిటిసి సభ్యుడు సాయిబాబా ఆప్కా చైర్మన్‌ కప్పల శ్రీధర్‌, తహశీల్దార్‌ డివిఎన్‌.అనిల్‌ కుమార్‌, ఎంపిపి కొండ అన్నపూర్ణ ప్రారంభించారు 600 మంది పైగా వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎఒ సురేందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కపిలేశ్వరపురం కేదార్లంక గ్రామ సచివాలయం లో గ్రామ సర్పంచ్‌ వీధి వెంకటరెడ్డి అధ్యక్షతన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఎంఎల్‌సి తోట త్రిమూర్తులు తనయుడు తోట పథ్వీరాజ్‌, ఎంపిపి మేడిశెట్టి సత్యవేణి, జెడ్‌పిటిసి సభ్యుడు పుట్టపూడి వీర వెంకట సూర్యనారాయణ ,తదితరులు పాల్గొని మాట్లాడారు . ఉప్పలగుప్తం సిఎం జగన్‌ ప్రవేశపెట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష పేదలకు వరం లాంటిదని జెడ్పిటిసి గెడ్డం సంపదరావు అన్నారు.ఎన్‌.కొత్తపల్లిలో సర్పంచ్‌ కుంచే చిట్టికుమారి అధ్యక్షతన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి సభ్యుడు గెడ్డం సంపదరావు, సొసైటీ అధ్యక్షులు నడింపల్లి వాసురాజు, వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.