Jul 11,2023 18:39

మాట్లాడుతున్న సురేంద్ర బాబు

ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు : జగనన్న సురక్ష సర్వే కార్యరకమంలో మండలంలోని ఇస్కపాలెం సచివాలయం జిల్లా స్థాయిలో ఆదర్శంగా నిలిచిందని సచివాలయాల ఇన్‌ఛార్జి తలమంచి సురేంద్ర బాబు పేర్కొన్నారు. మంగళవారం ఇసకపాలెం స చివాలయం పరిధి లోలోని పా పిరెడ్డి పాలెం గ్రామ పంచాయతీలో, మాచర్లవారిపాలెం సచివాలయాల్లో సురక్ష కార్యక్రమాలు జరిగాయి. ఎంపిడిఒ కన్నం హేమలత, ఇఒపిఆర్‌డి నారాయణ రెడ్డి టీమ్‌ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్ర మాల్లో సురేంద్ర బాబు, వైసిపి కన్వీనర్‌ ఉప్పల శంకరయ్య గౌడ్‌, ఎంపిపి స్వర్ణలత, ఇసనాక రమేష్‌ రెడ్డి ు హాజరయ్యారు. సురేంద్ర బాబు మాట్లాడుతూ జగనన్న సురక్ష సర్వే ప్రక్రియలో ఇసకపాలెం 89 శాతంతో జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. తహసిల్దార్‌ హమీద్‌ మాట్లాడారు. జడ్పిటిసి శేషమ్మ, తిరువ ల్లూరు ఈశ్వరయ్య, ఏంబేటి సంధ్యారాణి, తానే తిరుపత య్య, మణి, సర్పంచ్‌ దువ్వూరు కల్ప న, ఎంపీటీసీ సీనయ్య, దువ్వూరు ప్రకాష్‌ రెడ్డి, నాయుడు చిన్న సుధాకర్‌ రెడ్డి చింతల శ్రీనివాసులు ఉన్నారు.