Oct 10,2023 23:13

ప్రజాశక్తి-యంత్రాంగం
జిల్లాలో పలుచోట్ల జగనన్నఆరోగ్య సురక్ష కార్యక్రమాలు మంగళవారం నిర్వహించారు. వివరాలు ఇవి..
అమలాపురం దీర్ఘకాలిక రోగాలు ఇతర వ్యాధులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తుందని జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా తెలిపారు. మంగళవారం స్థానిక పురపాలక సంఘ 18 వ వార్డు సచివాలయం నందు నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహణ తీరు వివిధ స్టాల్స్‌ ను ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌ డెస్క్‌, స్పాట్‌ రిజిస్ట్రేషన్‌, కేస్‌ షీట్‌ కౌంటర్‌, ల్యాబ్‌ టెస్టింగ్‌ కౌంటర్‌, మందుల పంపిణీ కౌంటర్‌, ఆరోగ్యశ్రీ హెల్ప్‌ కౌంటర్‌. ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫుడ్‌ స్టాల్స్‌ను పరిశీలించారు. శిబిరానికి విచ్చేసిన పేషంట్లతో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలను పేదలందరూ సద్వినియోగం చేసుకోవాల న్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ విఐపి నాయుడు వైస్‌ చైర్మన్‌ నాని రాజు, ఎన్‌.వెంకటేశ్వరరావు, అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సిహెచ్‌వి.భరత లక్ష్మి వార్డు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆత్రేయపురం కట్టుంగ గ్రామంలో జగనన్న ఆరోగ్య వైద్య శిబిరాన్ని జెడ్‌పిటిసి సభ్యుడు బోనం సాయిబాబా ఆయన ప్రారంభించారు కార్యక్రమంలో సర్పంచ్‌ కరుటూరు బ్రహ్మాజీ, మండల వైసిపి కన్వీనర్‌ శ్రీనివాసరాజు, ఆప్కా చైర్మన్‌ కప్పల శ్రీధర్‌ ఎంపిడిఒ నాతి బుజ్జి తదితరులు పాల్గొన్నారు. ఐ.పోలవరం మండల కేంద్రం పరిధిలో ఉన్న పాతఇంజరం గ్రామ పంచాయతీ పరిధిలో జిల్లా జెడ్‌పిఉన్నత పాఠశాల ప్రదేశంలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్షలో భాగంగావైద్యశిబిరాన్ని మంగళవారం ఎంపిపి మోర్త రాణి మిరియం జ్యోతి ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా జెడ్‌పిటిసి సభ్యులు ముదునూరి సతీష్‌ రాజు హాజరయ్యారు. జి.వేమవరం పి హెచ్‌ సి వైద్యు రాలు ఇందిర ఆధ్వర్యంలో ఉన్న వైద్య సిబ్బందితో,రోగులను పరీక్షించారు. ఐ సి డి యస్‌ విస్తరణ అధికారి సి హెచ్‌ నాగలక్ష్మి ఆధ్వర్యంలో పోషకాహార ప్రదర్శన ఏర్పాటుచేశారు. కార్యక్రమంలో వై సి పి మండలపార్టీ అధ్యక్షులు పిన్నమరాజు వెంకట పతిరాజు, కొండేపూడి కపా వరప్రసాద్‌, మగాపు వీరబాబు, రేవు సింహాద్రి, కె.మధు, తహశీల్దార్‌ ఝాన్సీ లక్ష్మి కుమారి తదితరులు పాల్గొన్నారు. మండపేట మండలంలోని మెర్నిపాడు గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం గ్రామ సర్పంచ్‌ గారపాటి సౌజన్య అధ్యక్షతన మంగళవారం జరిగి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎంపిపి ఉండమట్ల వాసు, వైసిపి యువ నాయకులు తోట పథ్వి, వైసిపి రాష్ట్ర నాయకులు దూలం వెంకన్న బాబు మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపిటిసి సభ్యురాలు అడ్డాల శ్రీదేవి, గ్రామ ఉపసర్పంచ్‌ యనమదుల వెంకటలక్మి, పార్టీ కన్వీనర్‌ చిటికిన వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. అమలాపురం(అల్లవరం) అల్లవరం మండలం కొమరగిరిపట్నం గ్రామపంచాయతీ పరిధి గ్రామ సచివాలయం 2 లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. ముఖ్య అతిథిగా మండల అధ్యక్షులు యిళ్ల శేషగిరి రావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ ఎన్‌ఎస్‌ఎస్‌.ప్రసాద్‌, ఇఒపిఆర్‌డి పి. వెంకటేశ్వరరావు, మండల నాయకులు తిక్క ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. మామిడికుదురు మామిడికుదురు సచివాలయం-1లో మంగళవారం సర్పంచ్‌ గౌస్‌ మోహిద్దీన్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎంపిడిఒ కె.వెంకటేశ్వరరావు, కారుపల్లి వెంకటేశ్వరరావు, ఇఒపిఆర్‌డి అడబాల శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి పిఎస్‌విఎస్‌.ప్రసాద్‌ ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఉప్పలగుప్తం కూనవరంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. వైద్య శిబిరంలో అందుకున్న వైద్య సేవలను జెడ్‌పిటిసి సభ్యుడు గెడ్డం సంపదరావు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ తనయుడు డాక్టర్‌ శ్రీకాంత్‌ లు పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ వాకపల్లి ఈశ్వరి, ఎంపిటిసి సభ్యురాలు కాట్రు ధనలక్ష్మి, సొసైటీ అధ్యక్షులు ఊటాల రామాంజనేయులు, తహశీల్దార్‌ జవ్వాది వెంకటేశ్వరి, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.