Oct 06,2023 23:41

ప్రజాశక్తి-యంత్రాంగం
జిల్లాలో జగనన్న సురక్ష కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ సందర్బంగా వైద్యశిబిరాలు నిర్వహించారు. వివరాలుఇవి..
మండపేట ద్వారపూడి గ్రామంలో సచివాలయం 4లో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని కలెక్టర్‌ జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా పరిశీలించారు. జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌ డెస్క్‌, స్పాట్‌ రిజి స్ట్రేషన్‌, కేస్‌ షీట్‌ కౌంటర్‌, ల్యాబ్‌ టెస్టింగ్‌ కౌంటర్‌, మందుల పంపిణీ కౌంటర్‌, ఆరోగ్యశ్రీ హెల్ప్‌ కౌంటర్‌, ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫుడ్‌ స్టాల్స్‌ ను ఆయన పరిశీలించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్ర మంలో కుటుంబ సభ్యులకు అవసరమైన 7 రకాల వైద్య పరీక్షలు చేసి, వారి ఆరోగ్య సమస్యలను ముందు గానే గుర్తించడంతో పాటుగా వైద్య శిబిరాలలో మరో 14 రకాల వైద్య పరీక్షలు 105 రకాల ఔషధాలు ఉచితంగా అందిస్తున్నారని జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలను పేదలందరూ సద్విని యోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో తాసిల్దార్‌ రాజేశ్వరరావు, మండల పరిషత్‌ అభివద్ధి అధికారి ఐదం రాజు, వైద్య ఆరోగ్యశాఖ వైద్యులు, ఐసిడిఎస్‌ సిబ్బంది పాల్గొన్నారు. అంబాజీపేట పేదల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం జగనన్న ఆరోగ్య కార్యక్రమం నిర్వహిస్తుందని పి.గన్నవరం ఎంఎల్‌ఎ కొండేటి చిట్టిబాబు అన్నారు. మాచవరం-3 లో పోతాయిలంక ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కంటి వెలుగులో భాగంగా అవ్వ, తాతలకు కళ్ళజోళ్ళు పంపిణీ చేశారు. పౌష్టికాహార స్టాల్స్‌ను పరిశీలించారు. సురక్ష కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ నాగాబత్తుల శాంతకుమారి, ఎంపిపి దొమ్మేటి వెంకటేశ్వరరావు, సొసైటీ చైర్‌ పర్సన్‌ దొమ్మేటి సత్యమోహన్‌, కంటి వైద్యులు, నాయకులు, వైద్య సిబ్బంది, పాల్గొన్నారు. అమలాపురం రూరల్‌ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని అమలాపురం ఎంపిపి కుడుపూడి భాగ్యలక్ష్మి అన్నారు. శుక్రవారంకామనగరువు సచివాలయం 2 పరిధిలోని సజన కాన్వెంట్‌ ఆవరణలో జగనన్న సురక్ష ఆరోగ్య వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గామ ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు, కళ్ళజోళ్ళు ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌ దంగేటి డోలమని రుద్ర, సర్పంచ్‌ నక్క అరుణ కుమారి చంద్రశేఖర్‌, జెడ్‌పిటిసి సభ్యుడు పందిరి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. రామచంద్రపురం ప్రభుత్వం ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని కూళ్ల సర్పంచ్‌ చిల్లి నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం కూళ్ల గ్రామపంచాయతీ వద్ద శుక్రవారం నిర్వహించారు. మండల అధ్యక్షురాలు పంపన నాగమణి, సర్పంచ్‌ చిల్లీ నాగేశ్వరరావు, ఎంపిటిసి సభ్యులు పిల్లి దుర్గాప్రసాద్‌, ఎంపిడిఒఎన్‌.శ్రీనివాస్‌, తహశీల్దార్‌ వైద్యనాథ శర్మ ఈ వైద్య శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 650 మంది గ్రామస్తులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉప్పలగుప్తం గొల్లవిల్లి గ్రామ సచివాలయంలో సర్పంచ్‌ జొన్నాడ శ్రీదుర్గ అధ్యక్షతన శుక్రవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. పలు విభాగాల వైద్యులు రోగులను పరీక్షించి ఉచితంగా మందులు అందజేశారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి సభ్యుడు గెడ్డం సంపదరావు, ఉప సర్పంచ్‌ దొంగ దుర్గ, ఎంపిటిసి సభ్యురాలు దోనిపాటి బాలమ్మ, ఎంపిడిఒ కెవి.ప్రసాద్‌, తహశీల్దార్‌ జవ్వాది వెంకటేశ్వరి, ఇఒపిఆర్‌డి కెఎస్‌.గౌరి కుమారి తదితరులు పాల్గొన్నారు.