
మాట్లాడుతున్న ప్రధానోపాధ్యాయులు
మాట్లాడుతున్న ప్రధానోపాధ్యాయులు
పలుచోట్ల జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు.
ప్రజాశక్తి-బిట్రగుంట:బోగోలు పంచాయతీలోని మండల ప్రజా పరిషత్ పాఠశాలలో 56వ జాతీయ గ్రంథాలయ వార్షికోత్సవ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఎం.రాధయ్య, ఎం రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. గ్రంథాలయ పితామహుల చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ గ్రంథాలయంలోని పుస్తకాలు చదవడం వల్ల విద్యార్థులకు మంచి తెలివితేటలు వస్తాయని, చదువుతోపాటు ఇతర పుస్తకాలను కూడా చదవాలని సూచించామన్నారు. సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన చిత్రలేఖనం పోటీలను నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రంగనాథం, వెంకటరమణయ్య ,విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.