Dec 17,2022 23:14

గంధవరంలో ప్రచారం చేస్తున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి-యంత్రాంగం
పద్మనాభం : మండలంలోని గంథవరం, తునివలస, రేవిడి గ్రామాల్లో టిడిపి నాయకులు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాలు నిర్వహించారు. గంథవరంలో జుత్తాడ గణేష్‌ ఆధ్వర్యాన, రేవిడిలో పి.అప్పలనాయుడు ఆధ్వర్యాన, తునివలసలో ఆర్‌ఎన్‌.మూర్తి ఆధ్వర్యాన ఇంటింటీకి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తున్నారు. ధరల పెరుగుదలను, ప్రశ్నించేవారిపై కేసులు పెట్టడాన్ని ప్రజలకు వివరించారు.
మల్కాపురం : 62వ వార్డు పరిధి త్రినాధపురంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే పిజివిఆర్‌.నాయుడు ప్రజల సమస్యలడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాలినాయుడు, జోగి, రాజమణి పాల్గొన్నారు.