ప్రజాశక్తి-యంత్రాంగం
భీమునిపట్నం : జివిఎంసి మూడో వార్డు పరిధిలో ఉన్న తోటవీధి తదితర ప్రాంతాల్లో బుధవారం టిడిపి నాయకులు 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' పేరిట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రచ్చ బండ నిర్వహించి ప్రజల సమస్యలనడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కోరాడ రాజబాబు మాట్లాడుతూ, వైసిపి పాలనలో అన్ని తరగతుల ప్రజలు అవస్థలు పడుతున్నారని విమర్శించారు. ఇంటి పన్ను పెంపు, చెత్త పన్ను విధింపు, విద్యుత్ చార్జీల పెంపు తదితర భారాలు ప్రజలపై ఈ ప్రభుత్వం మోపిందన్నారు. 2024 ఎన్నికల్లో టిడిపి విజయం తధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యదర్శి గంటా నూకరాజు, నాయకులు సిహెచ్ రమణ, ఎ.గురునాథ్, వి.రాంబాబు, కొక్కిరి అప్పన్న, ఎం.సంజీవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
9వ వార్డులో..
ప్రజాశక్తి - ఆరిలోవ : ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆదేశాల మేరకు వార్డు టిడిపి ఇన్‌ఛార్జి బుడుమూరు గోవిందు ఆధ్వర్యంలో విజయదుర్గా కాలనీలో 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమాన్ని బుధవారం చేపట్టారు. దీనిలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలనడిగి తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో టిడిపి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు బాదరు బాలరాజు, ఒమ్మి రాజు, కాళ్ల మహేష్, నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.










