ప్రజాశక్తి - ఏలూరు
స్థానిక ఎన్‌ఆర్‌ఐ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో బుధవారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలను పూలతో ముగ్గులు, గొబ్బెమ్మలతో అలంకరించి, ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందినవారికి కళాశాల సిఇఒ వి.తులసీరామ్ బహుమతులు అందించారు. అనంతరం హరిదాసుని పాటలు, భోగిమంటలు, గంగిరెద్దు విన్యాసాలతో కనువిందుగా అలరించారు. వివిధ రకాల సాంప్రదాయ పిండివంటలు ప్రదర్శించి అందరికీ రుచులను అందించారు. కళాశాల సిఇఒ వి.తులసీరామ్ మాట్లాడుతూ మన సాంప్రదాయం, సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్ వి.కనకరత్నం, ఇ.మురళీకృష్ణ, కె.ప్రభాకరరావు, ఎస్.సత్యనారా యణ, సిహెచ్ ఎన్‌వి.సత్యనారాయణ, సిహెచ్. శివకుమార్, ఎఒలు కె.మల్లికార్జునరావు, వి.రాట్నాలు, ఎస్.రామాంజ నేయు లు, జె.నాగరాజు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
స్థానిక గాంధీనగర్ న్యూజనరేషన్ స్కూల్‌లో సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా నిర్వహించారు. విద్యార్థులు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. భోగిమంటలు, గొబ్మెమ్మలు, చిన్నారులకు భోగి పండ్లు పోశారు. స్థానిక ఏలూరు నగర డిప్యూటీ మేయర్ గుడిదేశి శ్రీను, 47వ డివిజన్ కార్పొరేటర్ తుమరాడ స్రవంతి చిన్నారులను ఆశీర్వదించారు. పాఠశాల సంచాలకులు ఎన్‌ఆర్‌కెఎ.ప్రసాద్ మాట్లాడుతూ తెలుగు వారి సాంప్రదాయ విశిష్టత గురించి వివరించారు.
ముదినేపల్లి : ముదినేపల్లి సాయిరాం డిగ్రీ కళాశాలలో బుధవారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఎల్‌ఎ తనయులు దూలం వినరుకుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి మనందరికి నవ్యక్రాంతి తేవాలన్నారు. తెలుగుతనం ఉట్టిపడేలా సాంప్రదాయ వస్త్రధారణలతో అలంకరించిన విద్యార్థులు బుట్టబొమ్మలా ఉన్నారన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన విద్యార్థుల ప్రదర్శనలు అందరిని అకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎంపిపి రామిశెట్టి సత్యనారాయణ, జెడ్‌పిటిసి సభ్యులు ఈడే వెంకటేశ్వరమ్మ, డెరెక్టర్ గంటా సంధ్య, గ్రామ సర్పంచి నిమ్మగడ్డ కైకమ్మ, వైస్ ఎంపిపి రాధా, సునీత, వైసిపి నేత నిమ్మగడ్డ భిక్షాలు పాల్గొన్నారు.
భీమడోలు :భీమడోలు శ్రీ చైతన్య పాఠశాల ఆవరణలో బుధవారం నిర్వహించిన ముందస్తు సంక్రాంతి కార్యక్రమాలకు విద్యార్థులు, వారి కుటుంబ సభ్యుల నుంచి ఆదరణ లభించిందని ప్రిన్సిపల్ డి.సోనీ తెలిపారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తులను ధరించి వివిధ వేషధారణలతో పలు కార్యక్రమాలను నిర్వహించారు. భోగి మంటలు వేశారు. గొబ్బెమ్మలతో సంక్రాంతిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ విద్యార్థులను భోగి పండ్లతో ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సమన్వయకర్త సిహెచ్.ఉదయభాస్కర్, డీన్ భార్గవకిరణ్, ఎఒ ముఖేష్ పాల్గొన్నారు.










