ప్రజాశక్తి -యంత్రాంగం
ప్రజాశక్తి - ఆరిలోవ : జివిఎంసి 13వ వార్డు పరిధి ఆరిలోవ కాలనీ, శివాజీనగర్, భగత్‌సింగ్‌నగర్ ప్రాంతాల్లో వార్డు కార్పొరేటర్ కెల్ల సునీత ఆధ్వర్యాన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. తూర్పు నియోజకవర్గ వైసిపి సమన్వకర్త, ఎంపీ ఎంవివి.సత్యనారాయణ, కెల్ల సునీత ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. స్థానిక సమస్యలనడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు వైసిపి ఇన్‌ఛార్జి కెల్ల సత్యనారాయణ, శిరీష, పిల్లి వీర్రాజు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
సీతమ్మధార : జివిఎంసి 26వ వార్డు పరిధి రామకృష్ణ నగర్-2 సచివాలయం, ఎన్జీజీవోస్ కాలనీలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఉత్తర నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త కెకె.రాజు, పార్టీ వార్డు ఇన్‌ఛార్జి పీలా వెంకటలక్ష్మితో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రజల సమస్యలనడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కెకె.రాజు మాట్లాడుతూ, రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి పరిపాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో 14వ వార్డు కార్పొరేటర్ కె.అనిల్‌కుమార్‌రాజు, మాజీ కార్పొరేటర్ పోతు సత్యనారాయణ, 45వ వార్డు అధ్యక్షులు పైడి రమణ, పాండవ శ్రీను, రాయడు శ్రీను, జెసిఎస్ మండల కన్వీనర్ అమర్‌రెడ్డి, 26వ వార్డు నాయకులు శేషు, అమ్మాజీ, శ్యామల, గండ్రేటి రవి, ఎం.సునీల్, తదితరులు పాల్గొన్నారు.










