ప్రజాశక్తి - కొయ్యలగూడెం
గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైసిపి గెలుస్తుందని ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజు అన్నారు. మండలంలోని పొంగుటూరు గ్రామంలో సర్పంచి పసుపులేటి రాంబాబు ఆధ్వర్యంలో మంగళవారం గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఇంటి వద్దకు వెళ్లి సమస్యలను అడుగుతూ వారితో మమేకమై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పటికప్పుడు సమస్యలను తెలుసుకుని పరిష్కరించడం ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి గంజిమాల రామారావు, జెడ్‌పిటిసి సభ్యులు దాసరి శ్రీలక్ష్మి, వైసిపి మండల కన్వీనర్ గొడ్డటి నాగేశ్వరరావు, పశ్చిమ డెల్టా బోర్డు చైర్‌పర్సన్ గంజిమాల దేవి, మాజీ ఎంపిపి మట్టా సత్తిపండు, ఎంపిటిసి సభ్యులు నేలపోలు దుర్గారావు పాల్గొన్నారు.
చాట్రాయి : మండలంలోని పర్వతాపురంలో మంగళవారం నిర్వహించిన గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎంఎల్‌ఎ మేకా వెంకట ప్రతాప్ అప్పారావుకు పర్వతాపురం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందిరకీ అందుతున్నాయా లేదా అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని పలువురు ఎంఎల్‌ఎ దృష్టికి పలు సమస్యలను తీసుకొచ్చారు. గృహ నిర్మాణానికి సంబంధించిన బిల్లులు, ఇళ్ల స్థలాలు అందడంలేదని పలువురు చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి మిద్దె శివరామకృష్ణ, ఎంపిపి లంక నిర్మల, రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ ఛైర్మన్ దేసిరెడ్డి రాఘవరెడ్డి, ప్రభుత్వ అధికారులు, కార్యదర్శులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










