
ప్రజాశక్తి -యంత్రాంగం
ఆనందపురం : ఆనందపురం మండలం తర్లువాడ పంచాయతీ పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించారు. గ్రామస్తులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. పంచాయతీలో మంచి నీటి కుళాయిలు, విద్యుత్ స్తంభాలు, సైడ్ కాలువలు, శ్మశాన వాటికకు రోడ్లు తదితర సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. దీనిపై ముత్తంశెట్టి సానుకూలంగా స్పందించి 45 రోజుల్లో పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ అడప లవరాజు, సెక్రటరీ కరుణాకర్, సర్పంచ్ డిఆర్‌బి.నాయుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ మజ్జి వెంకట్రావు, వైస్ ఎంపిపిలు పాండ్రంకి శ్రీను, బొట్ట రామకృష్ణ, మజ్జి రమేష్‌నాయుడు, భీమిలి యూత్ ప్రెసిడెంట్ ఇల్లాపు వెంకటజగన్, వాలంటీర్లు పాల్గొన్నారు.
అరిలోవ : జివిఎంసి 10వ వార్డు పరిధి రాజీవ్ నగర్, వెటర్నరీకాలనీలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. వార్డు వైసిపి ఇన్‌ఛార్జి జగ్గుపిల్ల అప్పలరాజుతో కలిసి విశాఖ ఎంపీ, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త ఎంవివి సత్యనారాయణ ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రజా సమస్యలనడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రములో ఎపిఐఐసి డైరెక్టర్ మొల్లి అప్పారావు, నగర మహిళా అధ్యక్షులు కృపాజ్యోతి, రాజీవ్‌నగర్ గ్రామ అధ్యక్షులు, కనకల కృష్ణ, ఇందిరానగర్ గ్రామ అధ్యక్షులు ప్రసాద్, ఏపీ నగరాల డైరెక్టర్ కె.మోహన్‌రావు, నాయకులు బొడ్డు అప్పలనాయుడు, ఒమ్మి శ్రీను, పతివాడ కనకరాజు, బోండా శ్రీను, చొక్కర శేఖర్, రాజబాబు పాల్గొన్నారు.