ప్రజాశక్తి-యంత్రాంగం : విశాఖపట్నం జిల్లాలో పలుచోట్ల గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు.
పిఎం.పాలెం : జివిఎంసి 5వ వార్డు పరిధి బొట్టవానిపాలెంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలనడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించారు. సంక్షేమ ఫలాలను ప్రజలకందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించబోనని హెచ్చరించారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నాడు నేడు పేజ్-2 కింద సుమారు రూ.32 లక్షలతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ హేమలత మొల్లి, జోనల్ కమిషనర్ బొడ్డేపల్లి రాము, వైసిపి భీమిలి నియోజకవర్గం ఇన్‌ఛార్జి ముత్తంశెట్టి మహేష్, మాజీ కార్పొరేటర్ పోతిన హనుమంతరావు, 6వ వార్డు అధ్యక్షుడు బొట్ట అప్పలరాజు, పిల్లా కృష్ణమూర్తి పాత్రుడు, అల్లాడ లింగేశ్వరరావు, మోజ్జాడ రమణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
సీతమ్మధార : 47వార్డు సంజీవయ్యకాలనీ, తిక్కవానిపాలెం, అప్పర్ జయప్రకాష్ నగర్ ప్రాంతంలో ఉత్తర నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త కెకె రాజు, 47వ వార్డు కార్పొరేటర్ కంటిపాము కామేశ్వరితో కలిసి పర్యటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి ఇప్పటివరకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఫలాలను వివరించారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పర్యటించారు. ఈ సందర్భంగా కెకె రాజు, మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరిగే విధంగా వివిధ సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి అందిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకరరావు, కార్పొరేటర్లు కె.అనీల్‌కుమార్ రాజు, 45వ వార్డు వైసిపి అధ్యక్షులు పైడి రమణ, డైరెక్టర్ నూకరాజు, 47వార్డు నాయకులు వసంతల అప్పారావు, సుకుమార్, భరత్, కృపారావు, రాఘవులు, కనకరాజు, రమేష్, చందురెడ్డి, సురేష్, గురువొజి, రమణ, రాణి, వాసు, సీనియర్ నాయకులు చిరంజీవి, షేఖ్ బాబ్జి, బి.గోవింద్, హరిపట్నాయక్, కె.చిన్న, నంబాల రాజేష్, సునీల్, కోడూరి సుశీల తదితరులు పాల్గొన్నారు.










