
ప్రజాశక్తి - గంపలగూడెం: ఎపికి సిఎం జగనే ఎందుకు కావాలి అనే అంశంపై పలుచోట్ల కార్యక్రమాలు నిర్వహించారు. అవినీతి లేని పాలన అందిస్తున్న జగన్ కావాలో.. గత ప్రభుత్వ పెత్తందారి పాలన కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలంటూ ప్రజలకు సవాలు విసురుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధి కనుమూరులో శుక్రవారం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ గ్రామంలో ఇప్పటివరకు అందిన వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన వివరాలను పబ్లిక్ బ్యానర్‌పై చూపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు చావా వెంకటేశ్వరరావు, వతదితరులు పాల్గొన్నారు.
జగ్గయ్యపేట: పట్టణంలోని 4వ సచివాలయం ధనంబోర్డ్, విద్యానగర్ నందు వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో జగ్గయ్యపేట నియోజకవర్గం పరిశీలకలు నూతలపాటి హనుమయ్య, నియోజకవర్గ యువనాయకులు సామినేని వెంకటకష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హనుమయ్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ తుమ్మల ప్రభాకర్, పాల్గొన్నారు.మైలవరం : స్థానిక సచివాలయం-2 పరిధిలో శుక్రవారం సర్పంచ్ మంజు భార్గవి అధ్యక్షతన వై ఏపీ నీడ్స్ జగన్, కార్యక్రమంతో పాటు సచివాలయ పరిధిలో జరిగిన అభివద్ధి సంక్షేమ పథకాల డిస్‌ప్లేను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ వసంత వెంకట కృష్ణ ప్రసాద్ మాట్లాడారు. వత్సవాయి : చంద్రబాబు చిన్నాభిన్నం చేసిన వ్యవస్థను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాడిలో పెట్టారని రాష్ట్ర ప్రభుత్వవిప్ శాసనసభ్యులు సామినేని ఉదయభాను అన్నారు. మండలంలోని భీమవరం గ్రామంలో గ్రామ సచివాలయంలో వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వవిప్ శాసనసభ్యులు సామినేని ఉదయభాను, నియోజకవర్గ పరిశీలకులు నూతలపాటి హనుమయ్య గ్రామ పార్టీ నాయకులు గుండం రంగారెడ్డి, కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ అవినీతి లేని పాలన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, ఎంపీపీ కోలుసు రమాదేవి, గ్రామ సర్పంచి బీమాల వెంకట సుజాత, పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం: మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకష్ణ ప్రసాద్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే అనే కార్యక్రమం లో భాగంగా ఇబ్రహీంపట్నం సచివాలయం - 2 పరిధిలోని 14 వ వార్డు శక్తి నగర్ ప్రాంతంలో శుక్రవారం ప్రతి గడప గడప వద్దకు వెళ్లి గత ప్రభుత్వంకి మన ప్రభుత్వానికి గల తేడాని వివరించి, రాబోయే ఎన్నికలలో మరలా మన జగనన్ననే గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొండపల్లి మున్సిపాలిటీ వైయస్ ఆర్ సిపి నాయకులు, కార్యకర్తలు వాలంటీర్స్, గహ సారథులు, తదితరులు పాల్గొన్నారు.