Nov 02,2023 22:35

ప్రజాశక్తి-యంత్రాంగం జిల్లాలోని పలుచోట్ల గురువారం బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గారంటీ.. కార్యక్రమాన్ని టిడిపి నాయకులు నిర్వహించారు. కాకినాడ 29వ డివిజన్‌లో సిటీ మాజీ ఎంఎల్‌ఎ వనమాడి కొండబాబు పర్యటించి భవిష్యత్తు గ్యారెంటీ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, బంగారు సత్యనారాయణ, చొల్లంగి వీరబాబు, అమలకంటి బలరాం, చింతలపూడి రవి, రెడ్డనం సత్తిబాబు, కోడూరు పెద్ద, పొంగా బుజ్జి పాల్గొన్నారు. కాకినాడ రూరల్‌ మండలంలోని పెనుమర్తిలో మాజీ ఎంఎల్‌ఎ పిల్లి అనంతలక్ష్మి, టిడిపి రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణమూర్తి, జనసేన రాష్ట్ర కార్యదర్శి పొలసపల్లి సరోజిని జనసేన నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మట్టా ప్రకాష్‌ గౌడ్‌, కర్రి వెంకటరాజు, సరిదే నాగ హరినాథ్‌, కాకరపల్లి కృష్ణ, వాసంశెట్టి సత్తిబాబు, బావిశెట్టి శ్రీను, చాట్రాతి సాయిబాబా, పిల్లి విజరు గోపాల్‌ పాల్గొన్నారు. తాళ్లరేవు పోలేకుర్రు పంచాయతీ తోటపేట, పి.మల్లవరం పంచాయతీ పత్తి గొందిలో టిడిపి ఇన్‌ఛార్జి దాట్ల సుబ్బరాజు, మాజీ ఎంఎల్‌ఎ చెల్లి వివేకానంద, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుత్తుల సాయి ఇంటింటి ప్రచారం చేపట్టారు. మందాల గంగ సూర్యనారాయణ, జక్కల ప్రసాద్‌ బాబు, ఊడా రామకృష్ణ, నిమ్మకాయల మూర్తి, సాధనాల రామకృష్ణ, దున్నా సింహద్రి, వడ్లమూడి సతీష్‌, గుత్తుల వెంకటరమణ, కందికట్ల ఇంజనీర్‌, రాయుడు సింహచలం, దున్నా సుబ్రహ్మణ్యం, ఉంగరాల వెంకటేశ్వరరావు, వాడ్రేవు వీరబాబు, ధూళిపూడి వెంకటరమణ పాల్గొన్నారు. పెద్దాపురం 22వ వార్డులో నిర్వహించిన కార్యక్రమంలో ఎంఎల్‌ఎ చినరాజప్ప ముఖ్య అతిథిగా పాల్గొని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజా సూరిబాబు రాజు, టిడిపి పట్టణ అధ్యక్షులు రంది సత్యనారాయణ, కార్యదర్శి తూతిక రాజు, కొరుపూరి రాజు, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.