
ప్రజాశక్తి - కంచికచర్ల : ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా వైద్య శిబిరాలు నిర్వహిస్తుందని నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్‌రావు అన్నారు. కంచికచర్ల మండలం పరిటాలలో బుధవారం జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం నిర్వహించారు. ఎంపిడిఒ కె.శిల్ప అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి బషీర్, సర్పంచ్ యద్దనపూడి ఆనందం జ్యోత్స్న, కార్యదర్శి మీర్జావలి, జడ్పీటీసీ వేల్పుల ప్రశాంతి, సొసైటీ అధ్యక్షుడు మాగంటి వినరు, నాయకులు పాల్గొన్నారు. గంపలగూడెం : గ్రామాల్లో పేద బడుగు బలహీన వర్గాల ఆరోగ్య భద్రత ప్రభుత్వ బాధ్యత అని తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని అనుముల లంక గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రాంభించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి ఎమ్మెల్యే కతజ్ఞతలు తెలిపారు. ఎంపిపి శ్రీలక్ష్మి, జెడ్‌పిటిసి శామ్యూల్, గ్రామ సర్పంచ్ ధనికొండ దీప్తి,గౌరసానికమల, లబ్ధిదారులు పాల్గొన్నారు. వీరులపాడు : పెద్దాపురం గ్రామాల్లో జగనన్న ఆరోగ్య సురక్ష కేంద్రాలను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్‌మోహన్‌రావు ప్రారంభించారు. వన్‌టౌన్ : మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని 39వ డివిజన్ కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ హాల్ ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం బుధువారం జరిగింది. ఈ శిబిరం 116, 117, 118 సచివాలయాల పరిధిలో జరిగింది. ఈ వైద్య శిబిరాన్ని మేయర్ రాయన భాగ్యలక్ష్మి పరిశీలిస్తూ తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో 39వ డివిజన్ కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర రాఘవ, జోనల్ కమిషనర్ సర్కిల్- 1 డా.రవిచంద్, శానిటరీ సూపర్వైజర్స్, సచివాలయం కన్వీనర్లు, గహ సారథులు, ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.