ప్రజాశక్తి -గాజువాక : 74వ వార్డు టిజిఆర్ నగర్ గణపతి మండపంలో స్థానిక కార్పొరేటర్, వైసిపి సోషల్ మీడియా జిల్లా అధ్యక్షులు తిప్పల వంశీరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. 65,74,75 వార్డుల్లో అన్నసమారాధనను ప్రారంభించారు. కార్యక్రమంలో శ్రీను, దుర్గ కుమారి, సునీత, మంగ, ఉమా, సంధ్య, తరుణ టీచర్, ఝాన్సీ, రూప, సత్తిబాబు, సాయి, వంశీ, యశ్వంత్, మోహన్, పూజిత పాల్గొన్నారు.
ఆనందపురం : స్థానిక ఎస్‌సి, బిసి కాలనీలో జై దుర్గాభవానీ యూత్ అధ్వర్యంలో నిర్వహించిన అన్నసమారాధనను మండల వాణిజ్య విభాగం అధ్యక్షులు మేడిశెట్టి రాంజీ ప్రారంభించారు. రెండు వేలమందికి అన్నదానం చేశారు. యూత్ సభ్యులు ధనియాల సాయి, ఉంగరాల శ్రీను, సతీష్, గ్రామస్తులు పాల్గొన్నారు
ములగాడ : వినాయక ఉత్సవాల్లో భాగంగా 62వ వార్డు దుర్గానగర్‌లో గణేష్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్నసమారాధనను పశ్చిమ ఎమ్మెల్యే పి.గణబాబు ప్రారంభించి, స్వయంగా వడ్డించారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు మజ్జి. మాలినాయుడు, నేతలు నీలాపు జోజి, కోరుమిల్లి రాము, మురళి, గంగాధర్, నర్సింగరావు, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
పిఎం పాలెం: గణపతిఉత్సవాల సందర్భంగా కెవిఆర్ క్యాటరింగ్స్ అధినేత, తెలుగు యువత జిల్లా కార్యదర్శి గరే గురునాథ్ ఆధ్వర్యంలో పలు చోట్ల భారీ అన్నసంతర్పణలు నిర్వహించారు. రేవళ్ళ పాలెంలో సౌజన్య స్వీట్స్, కెవిఆర్ ఆధ్వర్యంలో అన్నసమారాధనలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో రెడ్డి సత్యన్నారాయణ, హ్యాండ్స్ టు హెల్ప్ చిన్ని, పోతిన వెంకటేష్, సంజీవ్, నాగోతి రమేష్, దుక్క గణేష్, సతీష్ పాల్గొన్నారు.
కంచరపాలెం : 53వ వార్డు సాయినగర్‌కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో వరసిద్ధి వినాయక ఉత్సవాల సందర్భంగా సాయినగర్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో భారీ అన్నసమారాధన నిర్వహించారు. కార్యక్రమంలో విగ్రహ విరాళ దాతలు అందుకూరు శివాజీ శర్మ, సురభి వెంకట రమణ, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
ఆరిలోవ : 11వ వార్డు గణేష్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నసమారాధనను నగర మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, వార్డు వైసిపి ఇన్‌ఛార్జి గొలగాని శ్రీనివాస్ ప్రారంభించారు. కార్యక్రమంలో గణేష్ యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు










