Sep 08,2022 23:53

అక్షరాస్యత దినోత్సవంలో మాట్లాడుతున్న ఎంపిపి

ప్రజాశక్తి - భీమునిపట్నం : స్థానిక రాయిపాలెం జివిఎంసి ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు జయంతి రాధా కుమారి ఆధ్వర్యాన ప్రపంచ అక్షరాస్యత దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఒకటో వార్డు బంగ్లామెట్ట ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు రెడ్డిపల్లి అప్పలరాజు ఆధ్వర్యాన నిర్వహించారు. అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వ్యాస రచన, క్విజ్‌ తదితర పోటీలు నిర్వహించారు.
పద్మనాభం : పద్మనాభం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో అక్షరాస్యతాదినోత్సవాన్ని నిర్వహించారు. విద్యార్థులు ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపిపి కంటుబోతు రాంబాబు హాజరై మాట్లాడారు. ప్రస్తుత గణాంకాల ప్రకారం పద్మనాభం మండలం 50 శాతం అక్షరాస్యత సాధించిందని తెలిపారు. శత శాతం అక్షరాస్యత సాధించేందుకు అందరి సహకారం అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వయోజన విద్యా శాఖ ఉప సంచాలకులు దుంపల చిన్నికృష్ణ, ఎంఇఒ శివరాణి, ప్రధానోపాధ్యాయులు బాలమణి, ఉపాధ్యాయులు ఆక్కులు తదితరులు పాల్గొన్నారు.