May 14,2023 17:17

డ్రైనేజీ సమస్యను పరిశీలిస్తున్న కమిషనర్

పలు వార్డులను  పరిశీలించిన కమిషనర్
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్

       వార్డుల్లో డ్రైనేజీ శానిటేషన్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ రవిచంద్ర రెడ్డి మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు.ఆదివారం ఉదయం మునిసిపల్ కమిషనర్ సి. రవిచంద్ర రెడ్డి, మునిసిపల్ హెల్త్ ఆఫీసర్ అంకిరెడ్డి , శానిటరీ ఇన్స్పెక్టర్ , శానిటరీ మేస్త్రీలు , వార్డు సెక్రటరిలు శ్రీనివాస సెంటర్ మెయిన్ రోడ్  డి - సిల్టిన్ పనులను, బాల్కొండ హాల్, పబ్లిక్ టాయిలెట్స్ & డ్రైనేజీ సమస్యలు గుడిపాటి గడ్డ, ములన్ పేట నందు శానిటేషన్, డ్రైనేజి క్లీనింగ్ పనులను  పరిశీలించారు. తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని కమీషనర్ అధికారులను ఆదేశించారు.