ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
గ్రంథాలయ 55వ వారోత్సవాల్లో భాగంగా స్థానిక శాఖా గ్రంథాలయంలో నిర్వహించిన వివిధ పోటీల్లో స్థానిక ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు 29 బహుమతులు గెలుచుకున్నారని ప్రిన్సిపల్ కె.లక్ష్మీసరోజారెడ్డి తెలిపారు. స్థానిక శాఖ గ్రంథాలయంలో నిర్వహించిన క్విజ్, డ్రాయింగ్, వ్యాసరచన, వృక్తత్వం, చదరంగం, లెమన్ స్పూన్ పోటీల్లో 29 బహుమతులు కైవసం చేసుకున్నారన్నారు. బహుమతులు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్ సుభాష్ రెడ్డి, డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.










