ప్రజాశక్తి-భట్టిప్రోలు: మాజీ మంత్రి, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు మండలంలో శనివారం పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. వెల్లటూరు గ్రామానికి చెందిన టిడిపి నాయకులు భానావత్ ధూళియా తల్లి దాలి అనారోగ్యంతో మృతి చెందగా ఆయన కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. అలాగే ఉత్తర సంఘంలో పెరవలి వెంకరస్వామి అనారోగ్యంతో చికిత్స పొంది ఇంటి వద్దనే విశ్రాంతి పొందుతుండగా పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు. అదేవిధంగా ఎంపిటిసి వాకా వెంకట నారాయణ తండ్రి శ్యామలరావు అనారోగ్యంతో మృతి చెందగా ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. అంతేకాక పెదపులివర్రు గ్రామం జీలుగువారిపాలెం గ్రామానికి చెందిన టీడీపీ క్రియాశీలక కార్యకర్త నిమ్మగడ్డ సుధాకర్ కుమారుడు విజయబాబు అకాలంగా మృతి చెందడంతో సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించి సంతాపం తెలియజేశారు. అదే గ్రామానికి చెందిన జీలుగు సుధాకర్ కుమారుడు బాబు(18) అనారోగ్యంతో మృతి చెందగా పరామర్శించి భరోసానిచ్చారు. ఈయన వెంట వెల్లటూరు, పెదపులివర్రు గ్రామాల టిడిపి నాయకులు పాల్గొన్నారు.










