Nov 15,2022 00:03

మహిళలతో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ

ప్రజాశక్తి - చోడవరం
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం సోమవారం మండలంలో గజపతినగరం గ్రామంలో స్థానిక శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ చేపట్టారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. తమ గ్రామంలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని పలువురు మహిళలు ఎమ్మెల్యేని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ గంగరాజు, స్థానిక సర్పంచ్‌ మళ్ల శ్రీనివాసరావు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
మునగపాక రూరల్‌ : మండలంలోని పురుషోత్తపురం గ్రామంలో ఎలమంచిలి నియోజకవర్గ శాసనసభ్యులు యువి రమణ మూర్తి రాజు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని కొంతమంది స్థానిక సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా, వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి మాజీ చైర్మన్‌ సుకుమార్‌ వర్మ, జడ్పిటిసి పెంటకోట స్వామి సత్యనారాయణ, వైసీపీ మండల కన్వీనర్‌ ఆడారి గణపతి అచ్చం నాయుడు పాల్గొన్నారు.
దేవరాపల్లి : డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు స్వగ్రామం తారువలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను గ్రామ ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యులు కర్రి సత్యం, మాజీ ఎంపీపీ కిలపర్తి భాస్కరరావు, వైసిపి మండల అధ్యక్షుడు బూరె బాబురావు, మండల స్థాయి అధికారులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.