ప్రజాశక్తి-మండపేట, అంబాజీపేట రాష్ట్రంలో వైసిపి పాలన అంతానికి రోజులు దగ్గర పడ్డాయని ఎంఎల్‌ఎ వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. మండపేట పట్టణ పరిధిలోని 4, 5, 6 వార్డుల్లో 'బాబు ష్యూరిటీ.. భవిష్యత్‌కు గ్యారంటీ' కార్యక్రమం 4వy ార్డు కౌన్సిలర్ గుండు రామతులసి వీరతాతరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎంఎల్‌ఎ వేగుళ్ల టిడిపి శ్రేణులతో కలిసి ఇంటింటికీ వెళ్లి టిడిపి మినీ మ్యానిఫెస్టోను వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్, పట్టణ అధ్యక్షుడు ఉంగరాల రాంబాబు, వాకచర్ల వాసంతి గుప్తా, బండి గోవిందు, సిరంగు ఈశ్వరరావు, నల్లమిల్లి వీర్రెడ్డి, టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అంబాజీపేట మండలం పుల్లేటికుర్రులో టిడిపి క్లస్టర్ 9 ఇన్చార్జ్ డివివి సత్యనారాయణ ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జల్లి బాలరాజు, ఎంపిటిసి పబ్బినీడి రాంబాబు, దొమ్మేటి సురేష్, ప్రభాకరరావు, నేదునూరి బాబులు, వి.అప్పారావు పాల్గొన్నారు.
టిడిపి ఆధ్వర్యాన 'గుంతల ఎపికి దారేదీ..'
అమలాపురం రూరల్, మండపేట : గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేదీ అనే కార్యక్రమంలో భాగంగా టిడిపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో శనివారం అమలాపురం మండలం రావులపాలెం-ఇమ్మడివరప్పాడు రోడ్డులో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రహదారి అధ్వానంగా మారిందని, వెంటనే మరమ్మతు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసే అమలాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జులు అయితాబత్తుల ఆనందరావు, శెట్టిబత్తుల రాజబాబు పాల్గొన్నారు. మండపేట నియోజకవర్గంలో గుంతల రహదారులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎంఎల్‌ఎ వేగుళ్ల జోగేశ్వరరావు, జనసేన ఇన్‌ఛార్జి వేగుళ్ల లీలాకృష్ణ అన్నారు. రామచంద్రపురం కెనాల్ రోడ్డును తక్షణం మరమ్మతులు చేపట్టాలని కోరుతూ వీరభద్రపురం రోడ్డులో నిరసన చేపట్టారు. రోడ్డు దుస్థితిపై ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన పార్టీల నాయకులు చుండ్రు శ్రీ వరప్రకాష్, ఉంగరాల రాంబాబు, కుంచే ప్రసాద్, వాకచర్ల గుప్తా, బొడ్డు రామకృష్ణ, షేక్ ఇబ్రహీం, సల్మాన్ హుస్సేన్, పిల్లా తాతీలు సరాకుల అబ్బులు తదితరులు పాల్గొన్నారు.