
ప్రజాశక్తి -నక్కపల్లి:నా మట్టి నా దేశంలో భాగంగా మండలంలోని చందనాడ గ్రామంలో బుధవారం రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వీసం రామకృష్ణ, ఎంపీపీ రత్నం, వైస్ ఎంపీపీ నానాజీ, జడ్పిటిసి సభ్యురాలు కాసులమ్మ, సర్పంచ్ రోహిణి భర్త తళ్ళ భార్గవ్, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఏవో సీతారామరాజు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు కొప్పిశెట్టి హరిబాబు పాల్గొన్నారు .
కోటవురట్ల:మండలంలో లింగాపురం, వెంకటా పురం, కోటవురట్ల, కొడవటిపూడి ఎంపీడీవో కాశీ విశ్వనాథరావు, అధికారులు నా మట్టి నా దేశం కార్యక్రమం చేపట్టారు. ఈఓపిఆర్‌డి సుబ్రహ్మణ్యం, ఏపీవో గంగు నాయుడు పాల్గొన్నారు.
గొలుగొండ:మండలంలోని పుత్తడిగైరంపేట పంచాయతీ సచివాలయంలో నా భూమి నా దేశం కార్యక్రమంలో భాగంగా అమరవీరులకు నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ పత్తి రమణ, విఆర్‌ఒ ధారబాబు, ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్, విఆర్పి రాజేశ్వరి, సచివాలయం కార్యదర్శి ఎం.రాజు పాల్గొన్నారు.
కృష్ణదేవిపేట అల్లూరి పార్కులో నర్సీపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ చిటికెల బాస్కర్‌నాయుడు, జిల్లా వైసిపి ఎస్సీ సెల్ అధ్యక్షురాలు, ఏఎల్‌పురం సర్పంచ్ లోచల సుజాత. ఉపాధి హామీ ఈసీ రాధిక, సెక్రటరీ శ్రీనివాస్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. లింగంపేట గ్రామంలో సర్పంచ్ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి అప్పారావు, గొంతిన ప్రసాదు తదితరులు పాల్గొన్నారు.
రోలుగుంట:స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి యర్రంశెట్టి శ్రీనివాసరావు, ఎంపిడిఒ కె.ప్రభాకర్, ఏపిఒ సూర్యమణి, ఇన్‌చార్జ్ ఈఒపిఆర్‌డి రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.
కశింకోట : మండలంలోని త్యేగాడ, కొత్తపల్లి, బుచ్చయ్యపేట గ్రామంలో బుధవారం నాభూమి-నాదేశం కార్యక్రమంలో భాగంగా ఎంపిపి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ వివి రవికుమార్, సర్పంచ్‌లు నీటిపల్లి ఈశ్వరమ్మ, కరణం శ్యేమ్‌సన్, కోన నాయుడు, ఎపిఓ శివ, సచివాలయం కార్యదర్శులు నాగేశ్వరరావు, సాయి ప్రియ, వైసిపి నాయకులు అద్దేపల్లి శ్రీను పాల్గొన్నారు.
చోడవరం : గోవాడ గ్రామపంచాయతీలో చోడవరం మార్కెట్ కమిటీ చైర్మన్ ఏడువాక సత్యారావు ఆధ్వర్యాన సర్పంచ్ ఏడువాక అమ్మియ్యమ్మ మొక్కలు నాటారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జే.దుర్గా ప్రసాద్, జూనియర్ అసిస్టెంట్ జి.అప్పారావు, మోదకొండ పాల్గొన్నారు.
దేవరాపల్లి : మండల కేంద్రంలోని హౌసింగ్ కార్యాలయం పక్కన ఎంపీడీవో సిహెచ్.సుబ్బలక్ష్మి ఆధ్వర్యంలోఎంపీపీ కిలపర్తి రాజేశ్వరి, జడ్పిటిసి కర్రి సత్యం మొక్కలు నాటారు. కార్యక్రమంలో తహశీల్దార్ ఎమ్.లక్ష్మి, వైద్య అధికారి ఎస్.లలిత, ఇన్‌ఛార్జి ఎంఈఓ బి.పడాల దాసు, ఎంఈఓ-2 వి.ఉషారాణి, ఏపీవో సూర్య కళ, వెలుగు ఏపిఎం ప్రభాకరరావు, పంచాయతీ ఈవో ఎస్.శ్రీనివాసరావు పాల్గొన్నారు.