
ప్రజాశక్తి -గొలుగొండ:మండలంలోని పలు గ్రామాల్లో సర్పంచ్‌ల ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించారు. ఏఎల్‌పురంలో సర్పంచ్ లోచల సుజాత, పుత్తడిగైరంపేటలో సర్పంచ్ పత్తి రమణ, ఎన్.కంఠారంలో సర్పంచ్ బిడిజాన రాజేశ్వరి, జోగుంపేటలో సర్పంచ్ జువ్వల లక్ష్మీ అధ్యక్షతన గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాలకు చెందిన నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
నక్కపల్లి :మండలంలోని పలు పంచాయతీ గ్రామాల్లో శుక్రవారం గ్రామ సభలు నిర్వహించారు. నక్కపల్లిలో సర్పంచ్ జయ రత్నకుమారి ఆధ్వర్యంలో జరిగిన గ్రామసభలో ఎంపీడీవో సీతారామరాజు, ఈఓపిఆర్డి వెంకట నారాయణ పాల్గొన్నారు. పంచాయతీ అభివృద్ధి, గ్రామంలో చేపట్టవలసిన పనుల రూపకల్పన, ప్రణాళిక తదితర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వీసం రాజు, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ , తదితరులు పాల్గొన్నారు.