Apr 09,2023 23:28

చినగదిలిలో మజ్జిగ పంపిణీ చేస్తున్న అతిథులు

ప్రజాశక్తి-యంత్రాంగం
వేసవి తీవ్రత పెరగడంతో విశాఖ నగరంలో పలుచోట్ల ఆదివారం చలివేంద్రాలను ఏర్పాటుచేశారు.
ములగాడ : కీర్తిశేషులు బాయిన శ్రీనివాసరావు, దాసరి పైడిరాజు జ్ఞాపకార్ధంగా వారి స్నేహితులు మల్కాపురం ప్రధాన కూడలి వద్ద ఆదివారం మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటుచేశారు. టిడిపి నాయకులు మజ్జి సోమేష్‌ ముఖ్యఅతిథిగా హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు. భిక్షగాళ్లు, పేదలకు భోజనం పొట్లాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బోస అప్పలరెడ్డి, శంకరరావు, స్నేహితులు, బంధువులు పాల్గొన్నారు.
అరిలోవ : 12వ వార్డు పరిధి చినగదిలి నార్త్‌ షిరిడి సాయిబాబా ఆలయం ప్రాంగణంలో వైసిపి సీనియర్‌ నాయకులు ఇజ్జాడ సత్యనారాయణ ఆధ్వర్యాన మజ్జిగ చలివేంద్రం ఆదివారం ఏర్పాటుచేశారు. ఆరిలోవ సిఐ సోమశేఖర్‌, వార్డు కార్పొరేటర్‌ అక్కరమాని రోహిణిరామన్‌ హాజరై మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పారిపల్లి రామారావు, మంగరాజు, వైసిపి సీనియర్‌ నాయకులు విక్టర్‌, వానపల్లి ఈశ్వరరావు, సత్యాల వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.
మాధవధార : కళింగ యూత్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన చలివేంద్రాన్ని 50వ వార్డు కార్పొరేటర్‌ వావిలపల్లి ప్రసాద్‌ ప్రారంభించారు. సనపల సూర్యనారాయణ జ్ఞాపకార్థం అతని కుమారుడు సనపల శ్రీకాంత్‌ ఆర్థిక సహాయం అందించారు. అనంతరం పర్యావరణాన్ని కాపాడాలంటూ మాధవ యోజన సమాజం ఆవరణలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమాల్లో 51వ వార్డు కార్పొరేటర్‌ ఆర్‌.వెంకటరమణ, వైసిపి మహిళా నాయకులు పేడాడ రమణికుమారి, 50వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సనపల వరప్రసాద్‌, మాధవ యువజన సమాజం కన్వీనర్‌ సనపల రామ్‌ గోపాల్‌రావు, 50వ వార్డు బిజెపి అధ్యక్షులు తమ్మినేని పద్మజ, కళింగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పైడి శ్రీనివాసరావు, నంబాల ఈశ్వరరావు, సనపల శ్రీకాంత్‌, తదితరులు పాల్గొన్నారు.
పెందుర్తి : నరవ గ్రామంలో జనసేన ఆధ్వర్యాన డొక్కా సీతమ్మ పేరుతో చలివేంద్రం ఏర్పాటు చేశారు. బాటసారుల దాహార్తిని తీర్చేందుకు ఈ చలివేంద్రం దోహదపడుతుందని జనసేన నాయకుడు శ్రీకాంత్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్వతి, పలువురు నాయకులు పాల్గొన్నారు.