మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ మేకపాటి
పలు అభివృద్ధి పనులు ప్రారంభం:చెర్లోయడవల్లిలో పలు అభివద్ది పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్ని వర్గాల అభ్యున్నతిని దష్టిలో ఉంచుకుని అభివద్ధి కార్యక్రమాలను పూర్తి చేసి ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తున్నామని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు.
శనివారం ఆత్మకూరు మండలం, చెర్లోయడవల్లి గ్రామంలో పలు అభివద్ధి పనులను, నిర్మాణం పూర్తి చేసుకున్న ప్రభుత్వ భవనాలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డికి స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. తొలుత గ్రామంలోని ఆలయాల్లో ఎమ్మెల్యే మేకపాటి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అభివద్ధి పనులను ప్రారంభించారు.చెర్లోయడవల్లి గ్రామంలో రూ.40 లక్షల నిధులతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. అదే విధంగా రూ.17.50 లక్షలతో నిర్మించిన వైఎస్సార్ హెల్త్ క్లినిక్ భవనాన్ని , రైతుల కోసం రూ.21.80 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని, రూ.17.67 లక్షలతో బల్క్ మిల్క్ కలెక్షన్ యూనిట్ భవనాన్ని లాంఛనంగా ప్రారంభించారు.గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా వచ్చిన అభివద్ధి నిధులు, మండల పరిషత్ నిధులతో చెర్లోయడవల్లి గ్రామంలో రూ.14లక్షలతో నిర్మించిన సిమెంటు రోడ్డును, నాగులపాడు గ్రామంలో రూ.10 లక్షలతో నిర్మించిన సిమెంటు రోడ్డును,రూ.4.985 లక్షలతో నాగులపాడులో నిర్మించిన కల్వర్టు నిర్మాణాన్ని ప్రారంభించారు. రావులకొల్లు గ్రామంలో రూ.8 లక్షలతో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో నిర్మించి సైడు కాలువలను ప్రారంభోత్సవం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలందరికిఉపయోగపడే విధంగా గ్రామంలోనే ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారన్నారు. అదే విధంగా రైతులు గ్రామంలోనే తమకు అవసరమైన వ్యవసాయోత్పుతులు పొందేలా రైతు భరోసా కేంద్రాలను, గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యసేవలు మరింత అందుబాటులోకి తెచ్చే విధంగా విలేజ్ హెల్త్ క్లీనిక్ లు, పాడి రైతుల కోసం బల్ మిల్క్ కలెక్షన్ యూనిట్ భవనాలను అందుబాటులోకి తెచ్చారన్నారు.గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన అభివద్ది పనులను కూడా పూర్తి చేస్తున్నట్లు వివరించారు.ఎంపీపీ కేత వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కీర్తిశేషులు మేకపాటి గౌతమ్ రెడ్డి చెర్లో ఎడవల్లి గ్రామం అంటే ఎంతో మక్కువ చూపించేవాడని ఏది అడిగినా కాదు చేయలేను అని చెప్పేవారు కాదన్నారు. అలాంటి ఉన్నతమైన వ్యక్తి గౌతమ్ రెడ్డి అని అన్నారు. సచివాలయం పరిధిలోని చర్లో ఎడవల్లి , రావులకొల్లు , నాగులపాడు , నారంపేట , గ్రామాల ప్రజలు ఎంతగానో సహకరిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి సభ్యులు పెమ్మసాని ప్రసన్న లక్ష్మి, ఆర్‌డిఒ కరుణ కుమారి, ఎంపీడీఓ ఐజాక్ ప్రవీణ్, అల్లారెడ్డి ఆనంద్ రెడ్డి, కొండ వెంకటేశ్వర్లు, ఐవి రమణారెడ్డి, సిండికేట్ ఫార్మర్ సొసైటీ చైర్మన్ సాన వేణుగోపాల్ రెడ్డి, బట్టే పాడు పీఏసీ చైర్మన్ బొమ్మిరెడ్డి రవికుమార్ రెడ్డి, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.










