ప్రజాశక్తి -కంచరపాలెం : జివిఎంసి 46వ వార్డులో రూ.1.50 కోట్ల వ్యయంతో నిర్మించే బిటి రోడ్లు, సీసీ రోడ్లు, డ్రెయిన్లకు, రూ.70 లక్షలతో చేపట్టే కస్తూరి నగర్-1, 2లో రక్షణగోడ పుననిర్మాణ పనులకు మేయర్ గొలగాని హరివెంకటకుమారి, నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త కెకె.రాజు, డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కో-ఆప్షన్ సభ్యులు సేనాపతి అప్పారావు, ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, 14వార్డు కార్పొరేటర్ కె.అనీల్‌కుమార్‌రాజు, జోనల్ కమిషనర్ ఆర్‌జివి కృష్ణ, ఈఈ శ్రీనివాస్, బలిరెడ్డి గోవింద్, కె.చిన్నా, ఎన్.కృష్ణ, లావణ్య, అప్పారావు, తారకేష్, రామారావు, అప్పలరెడ్డి, జి.ఈశ్వరరావు, ఈశ్వరరావు, సీతయ్యరెడ్డి, సోమునాయుడు తదితరులు పాల్గొన్నారు.
47వార్డులో...
జివిఎంసి 47వ వార్డులో రూ.1.50 కోట్ల వ్యయంతో నిర్మించే బిటి రోడ్లు, సీసీ రోడ్లు, డ్రెయిన్లకు, రూ.45 లక్షలతో రాంజీ ఎస్టేట్‌లో నిర్మించే వైఎస్‌ఆర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అదనపు సౌకర్యాల కల్పనకు మేయర్ గొలగాని హరివెంకటకుమారి, వైసిపి సమన్వయకర్త కెకె.రాజు, వార్డు కార్పొరేటర్ కంటిపాము కామేశ్వరి శంకుస్థాపన చేశారు. ముందుగా బిఆర్.అంబెద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, జోనల్ కమిషనర్ ఆర్‌జివి కృష్ణ, ఈఈ శ్రీనివాస్, వసంతల అప్పారావు, సుకుమార్, కె.విజరు, రాఘవులు, కృపా, స్వర్ణమని, కనకరాజు, సురేష్, చందు రెడ్డి, రమణ, వాసు, జయకుమార్, నరసింగ్, రమేష్, గురువొజి తదితరులు పాల్గొన్నారు.
లు










