Jun 10,2023 23:53

ప్రజాశక్తి-సామర్లకోట రూరల్‌ సామర్లకోట మండలం వికెరాయపురం గ్రామంలో పలు అభివద్ధి పనులకు కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్‌ శనివారం శంకుస్థాపన చేశారు. రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దావులూరి దొరబాబు ఆధ్వర్యంలో మండలంలోని మాధవపట్నం, వికె.రాయపురంలో పలు అభివద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గ్రామాల అభివద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు చెప్పారు. దీనిలో భాగంగానే స్థానిక గ్రామానికి రూ.7 లక్షలు నిధులు మంజూరు కాగా వాటి పనులను ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. అనంతరం హౌసింగ్‌ చైర్మన్‌ దొరబాబు మాట్లాడారు. మాధవపట్నం, వికె.రాయపురం గ్రామాల పరిధిలో ఉత్తమ వాలంటీర్లను ఘనంగా సత్కరించారు. ఎంపిపి బొబ్బరాడ సత్తిబాబు, ఎంపిడిఒ డి.శ్రీలలిత, తలారి దొరబాబు, ఊటా వాసు పాల్గొన్నారు.