ప్రజాశక్తి - ఉంగుటూరు
అందరికీ సురక్షితమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో వెల్లమిల్లి, బాదంపూడి గ్రామాల్లో అభివృద్ధి పనులు నాణ్యతగా ఉండాలని అధికారులను ఎంఎల్‌ఎ పుప్పాల శ్రీనివాసరావు ఆదేశించారు. వెల్లమిల్లిలో రూ.50 లక్షలతో ఓవర్ హెడ్ ట్యాంకు, బాదంపూడిలో రూ.20 లక్షలతో పైపు మార్గం పనులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. దొంతవ రం, కాగుపాడు గ్రామాల్లో రూ.20 లక్షలతో సీసీ డ్రైయినేజీ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు ఆయా ప్రాంత ప్రజల కోరిక మేరకు తాగునీటికి, డ్రెయినేజీ నిర్మాణానికి ముఖ్యమంత్రి నిధులు మంజూరు చేసి మాట నిలబెట్టుకున్నా రన్నారు. ఈ కార్యక్రమంలో వెల్లమిల్లి, దొంతవరం, కాగుపాడు, బాదంపూడి సర్పంచులు వస్కా కుమార్‌రాజా, కంభంపాటి సత్యవతి, కడయాల సుదేష్ణ, కంకట పద్మలీల, ఎంపిడిఒ ప్రేమాన్విత, ఎంపిపి గంటా శ్రీలక్ష్మి, జెడ్‌పిటిసి సభ్యులు సభ్యులు కొరిపల్లి జయలక్ష్మి, ఎఎంసి మాజీ ఛైర్మన్ మరడ రమావతి, వైసిపి మండల కన్వీనర్ మంగారావు పాల్గొన్నారు.










