Jul 20,2023 22:11

రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే జోగారావు

పార్వతీపురంటౌన్‌: పట్టణంలోని 28వ వార్డు చినదేవరవీధిలో 15వ ఆర్థిక సంఘం నుంచి విడుదలైన రూ.4 లక్షల నిధులతో సిసి రోడ్డు, కాలువ అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆ వార్డు కౌన్సిలర్‌ మజ్జి శశికర్‌తో కలిసి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి, 30 వార్డుల్లోని సమస్యలను గుర్తించి ఆయా వార్డుల ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పనలో భాగంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా ఈ వార్డు ప్రజల చిరకాల కోరికను నెరవేర్చిన దిశగా ఈ పనులకు శంకుస్థాపన చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బి.గౌరీశ్వరి, పార్టీ అధ్యక్షులు కొండపల్లి బాలకృష్ణ, పార్టీ ఫ్లోర్‌ లీడర్‌ మంత్రి రవికుమార్‌, స్థానిక కౌన్సిర్లు, కో ఆప్షన్‌ సభ్యులు, జెసి ఎస్‌ కన్వీనర్‌ జి. మాధవరావు, సీనియర్‌ నాయకులు రెడ్డి రవికుమార్‌, ఎస్‌విఎస్‌ఎన్‌ రెడ్డి, పి.శ్రీనివాసరావు, సఫి, ఎస్‌ ప్రకాష్‌, తదితరులు పాల్గొన్నారు.
బందలుప్పి-అంటి వలస రోడ్డు పనులు ప్రారంభం
పార్వతీపురం రూరల్‌ : నాలుగేళ్లు క్రితం అర్ధాంతరంగా నిలిపివేసిన మండలంలోని బందలుప్పి - అంటి వలస బీటీ రోడ్డు పనులను రూ.1.90 లక్షల వ్యయంతో తిరిగి నిర్మించేందుకు పనులను ఎమ్మెల్యే అలజంగి జోగారావు ప్రారంభించారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ అంటివలస - వీరభద్రపురం బిటి రహదారితో పాటు మండలంలో 11 రోడ్లు పనుల నిధులన్నీ స్వాహా చేసేసి పనులు ఆధారంతరంగా ఆపేసిన రహదారులను తిరిగి తమ హయాంలో నిర్మాణాలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బోమ్మి రమేష్‌, సీనియర్‌ నాయకులు యాళ్ల ఈశ్వర ప్రతాప్‌, ఎంపిపి ప్రతినిధి మజ్జి శేఖర్‌, సర్పంచ్‌ గోర్జి రాజేంద్ర ప్రసాద్‌, స్థానిక వైసిపి నాయకులు యాళ్ల శ్రీరాములు నాయుడు, బి.శేఖర్‌, వి.రామకృష్ణ, ఎ.వెంకటరమణ, నల్లం నాయుడు, డి.నారాయణరావు, నల్ల గణపతి, పిఆర్‌ ప్రాజెక్ట్స్‌ డిఈ, ఏఈ, గుత్తేదారులు శివరామరాజు వివిధ గ్రామాల వైసీపీ సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు స్థానిక ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.