ప్రజాశక్తి-గండేపల్లి నీలాద్రిరావుపేటలో గ్రామ సచివాలయాన్ని కాకినాడ ఎంపీ వంగా గీతా, జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, కాకినాడ రూరల్ ఎంఎల్‌ఎ కురసాల కన్నబాబు, జగ్గంపేట ఎంఎల్‌ఎ జ్యోతుల చంటిబాబు ప్రారంభించారు. అనంతరం నీలాద్రిరావుపేటలో జరిగిన జగనన్న సురక్ష శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ వంగా గీత మాట్లాడుతూ గతంలో ప్రజలకు ఏ అవసరం వచ్చినా ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేదని.. ఇప్పుడు ఆ పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చిందన్నారు. ఎవరూ ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండానే మన అవసరాలను ప్రభుత్వమే గుర్తించి.. ఇంటి దగ్గరికే వచ్చి సేవలు అందించే పరిస్థితి వచ్చిందన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా కుల, ఆదాయ తదితర ధ్రువీకరణపత్రాలను ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ ప్రఖర్ జైన్, ఎంపిపి చలగళ్ల దొరబాబు, ఎఎంసి ఛైర్మన్ జనపరెడ్డి బాబు, ఆర్‌డిఒ జె.సీతారామారావు, తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపిడిఒ వెంకట రామన్, ఒఎన్‌జిజి కాకినాడ హెడ్ మల్లిక్ తదితరులు పాల్గొన్నారు.
పేద ప్రజల కలలు నెరవేర్చడమే వైసిపి ప్రభుత్వ లక్ష్యమని పలువురు ప్రజాప్రతినిధులు అన్నారు. మండలంలోని నీలాద్రిరావుపేటలో కలెక్టర్ కృతికా శుక్లా, ఎంపీ వంగా గీతా విశ్వనాథ్, మాజీ మంత్రి, కాకినాడ రూరల్ ఎంఎల్‌ఎ కురసాల కన్నబాబు, జగ్గంపేట ఎంఎల్‌ఎ జ్యోతులు చంటిబాబు వంతెన ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ సుమారు రూ.46 లక్షల నిధులతో వంతెన నిర్మించడంతో కల నెరవేరిందన్నారు. ఈ కార్యక్రమంలో ఒఎన్‌జిసి కాకినాడ సిజిఎంహెచ్‌ఆర్ డి.మాలిక్, ఇరిగేషన్ అధికారులు డి ఏసుబాబు, రాజేశ్వరరావు, డిఇ శ్రీనివాస్, జెఇ జగదీష్, ఆర్‌డిఒ సీతారామారావు గ్రామ సర్పంచ్ ములంపాక సురేష్, సొసైటీ అధ్యక్షుడు బొడ్డు సత్తిరాజు, జెడ్‌పిటిసి సభ్యుడు పరిమి వెంకటలక్ష్మి మంగతాయారు బాబు, ఎంపిపి చలగళ్ల దొరబాబు, జాస్తి వసంత్, ఎంపిడిఒ బిఎస్‌కె.రామన్, తహశీల్దారు కెవివి.సత్యనారాయణ, పాల్గొన్నారు.










