Nov 07,2023 01:15

డిఆర్‌ఒ కు వినతిపత్రం ఇస్తున్న సిపిఎం నాయకులు

పల్నాడు జిల్లా: పల్నాడు జిల్లాలో కరువు నెలకొందని, 40 శాతం పైగా భూముల్లో పంటలేమీ వేయకపోగా వేసిన వాటిల్లో ఎక్కువ శాతం ఎండిపోతున్నా కరువు జిల్లాగా ఎం దుకు ప్రకటించడం లేదని సిపిఎం నాయ కులు ప్రశ్నించారు. ఈ మేరకు స్పందనలో డిఆర్‌ఒకు సోమవారం వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరుకుమార్‌, కార్యదర్శివర్గ సభ్యులు వై.రాధాకృష్ణ, ఏపూరి గోపాలరావు మాట్లాడుతూ కొన్ని సాంకేతిక కారణాలు చూపించి పల్నాడు జిల్లాలో ఒక మండ లాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించలేదని, ఇప్పటికైనా వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి రైతులు సాగు చేసిన పంటలు నష్టపరిహారం అంచనా వేసి కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయ పనులు లేక రైతులతో పాటు కూలీలు కూడా ఇబ్బందులు పడుతున్నా రని ప్రస్తుతం పంటల సాగు చేస్తున్న వారిలో 70 శాతం మందికి పైగా కౌలు రైతులు ఉన్నారని, వారికి రుణమాఫీ చేయాలని కోరారు. పనులు లేక రైతులు వ్యవసాయ కూలీలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో చౌక దుకాణాల ద్వారా బియ్యంతో పాటు ఇతర నిత్యావసరాలను సరఫరా చేయాలన్నారు. ప్రస్తుతం ఒక మోస్తరుగా కురిసిన వర్షాలతో ఎటువంటి ప్రయోజనం లేదని, మొక్కజొన్న ఇప్పటికే పూర్తిగా దెబ్బతిందని తెలిపారు. మొక్కజొన్నకు 20 రోజుల క్రితం నీరు ఇచ్చి ఉంటే కనీసం పెట్టు బడులు వచ్చేవన్నారు. మిర్చి, పసుపు తదితర ఆరుతడి పంటలు సాగుచేసిన రైతులకు ఆరుతడి పంటలకు నీరు అంద జేసి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. తక్షణమే రైతు భరోసా కేంద్రాల సిబ్బంది ద్వారా ఆయా గ్రామాలలో సాగుచేసిన పంటలను నష్టపరిహారం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించి పరిహారం అందేలా జిల్లా యంత్రాంగం కృషి చేయాలని కోరారు. ఆరుతడి పంటలకు నీరిచ్చి కాపాడే బాధ్యత ప్రభుత్వానిదే అయినా మీనమేషాలు లెక్కిస్తున్నారని విమర్శించారు. తాగునీటి అవసరాలకు ప్రతి మూడు నెలలకు ఒకసారి విడుదల చేసే నీటిని పొలాలకు మళ్లించరాదని చెబుతున్న అధికారులు ఎండిపోతున్న పం టలను కాపాడేందుకు ప్రత్యామ్నాయ మార్గం చూపాలన్నారు. వ్యవసాయ పనులు లేక కూలీలు వలస బాట పడు తున్నారని, వ్యవసాయ కూలీలను ఆదు కోవాలని డిమాండ్‌ చేశారు. కార్య క్రమంలో నాయకులు డి.శివకుమారి, షేక్‌ సిలార్‌ మసూద్‌, ప్రజా సంఘాల నాయ కులు పాల్గొన్నారు.