సత్తెనపల్లిరూరల్: పల్నాడు జిల్లా ఫుట్ బాల్ అసోసియేషన్ సమావేశం సత్తెనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో (సుగాలి) ఆదివారం నిర్వహించారు. రాష్ట్ర పుట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి పల్నాడు జిల్లా ఫుట్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి కె.సుబ్రహ్మణ్యేశ్వరరావు అధ్యక్షత వహించారు. పల్నాడు జిల్లాలో ఫుట్‌బాల్ అభి వృద్ధికి కృషి పై, బాలబాలికలు, మహిళలు, పురుషుల టోర్న మెంట్ల నిర్వహణ విషయమై చర్చించారు. రాష్ట్ర ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు, ఎంపి ఏలూరు కోటగిరి శ్రీధర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని క్రీడాకారులకు ఫుట్ బాల్స్ పంపిణీ చేశారు. ఈ సంద ర్భంగా శ్రీధర్‌కు సుబ్ర హ్మణ్యేశ్వర రావు, పల్నాడు జిల్లా ఫుట్‌బాల్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు, అస ిస్టెంట్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ ఎ.శ్రీరామ్ రెడ్డి, ఐఎస్ నాగిరెడ్డి, ఎండి రియాజ్, ఎస్‌ఎం సుభాని, ఎస్ అచ్చిరెడ్డి, ఎస్‌కె జాన్ సైదా, నూరుల్లా, అంజి రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, క్రీడాకారులు శుభా కాంక్షలు తెలిపారు.










