ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : నేతన్న నేస్తం 5వ విడత జమను ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తిరుపతి జిల్లా వి.కోట నుండి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పల్నాడు కలెక్టరేట్ నుండి కలెక్టర్ ఎల్.శివశంకర్ వర్చువల్‌గా హాజరయ్యారు. జిల్లాలో 422 మందికి రూ.101.28 కోట్లు మంజూరవగా లబ్ధిదార్లకు మెగా చెక్కును కలెక్టర్ అందించారు. వినుకొండ నియోజకవర్గ పరిధిలో 36 మందికి గాను రూ.8.64 లక్షలు, నరసరావుపేట నియోజకవర్గంలో ముగ్గురికి రూ.72 వేలు, గురజాల నియోజకవర్గంలో 9 మందికి రూ.2.16 లక్షలు, సత్తెనపల్లి నియోజకవర్గంలో 9 మందికి రూ.2.16 లక్షలు, పెదకూరపాడు నియోజకవర్గంలో 13 మందికి రూ.3.12 లక్షలు చిలకలూరిపేట నియోజకవర్గంలో 295 మందికి రూ.70.80 లక్షలు, మాచర్ల నియోజకవర్గంలో 57 మందికి రూ.13.68 లక్షలు మంజూరైనట్లు కలెక్టర్ వివరించారు.










