Jul 27,2023 23:36

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : విదేశీ విద్యా దీవెనను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌, ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి రెండో విడత విదేశీ విద్యా దీవెనను సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. నరసరావుపేటలోని కలెక్టరేట్‌ నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ఎ, ఎమ్మెల్యే, జిల్లా సంఘిక సంక్షేమ అధికారి ఓబుల నాయుడు, లబ్ధిదారులు పాల్గొ న్నారు. పల్నాడు జిల్లాకు సంబంధించి 18 మందికి రూ.1.57 కోట్ల అందించినట్లు కలెక్టర్‌ తెలిపారు. వి.సాయి ప్రశాంత్‌కు రూ.14,34,395, వై.సాయి అరవింద్‌కు రూ:15,91,631 మంజూరు కాగా లబ్ధిదార్లతో కలెక్టర్‌ మాట్లాడి వారి లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మెగా చెక్కును అందించారు.