
వైద్యపరీక్షలు చేస్తున్న దృశ్యం
పల్లెల్లో ఉచిత వైద్యశిబిరం
ప్రజాశక్తి-సీతారామపురం: ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ నాయకులు కాకర్ల సురేష్ ఏర్పాటు చేసిన కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని పేద ప్రజల కోసం ఎన్టీఆర్ సంజీవనీ ఆరోగ్య రథం ద్వారా ఉచిత వైద్య సేవలు, ఉచిత మందుల పంపిణీ చేస్తున్న విషయం విదితమే. అందులోబాగంగా 170వ రోజైన గురువారం ''సంజీవని ఆరోగ్యరథం ద్వారా మండలంలోని చిన్ననాగంపల్లి పంచాయితీ కార్యాలయం వద్ద అనారోగ్య సమస్యలు ఉన్న గ్రామస్తులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేయడంతో పాటుగా ఉచితంగా మందులు పంపిణీతో కూడిన వైద్య సేవలందించారు.120 మంది గ్రామస్తులకు డాక్టర్‌లు వివిధ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. 85 మంది కంటి చూపు సమస్యలకు పరీక్షలు నిర్వహించారు. మొత్తం 205 మంది చికిత్స తీసుకున్నారు.వీరందరికీ ఉచితంగా మందులు పంపిణీ చేశారు.