May 22,2022 11:38

నదిలో ఎగసిన అలలు
తీరాన్ని దాటి పాదాలను తాకుతున్నాయి..
బరువైన మేఘం తన
భారాన్ని ఎంతో అందంగా
గడ్డిపూల మీద వానగా మార్చింది..
సీతాకోకచిలుక తామరాకు వెనుక చేరింది..
రావాకు మీద పడిన ఆ చినుకు
చూడటానికి ధారలా మారింది..
ఒక్కొక్క ఆకు మీద పడిన చినుకు
రెక్కలొచ్చిన పక్షిలాగా
కిందకి గంగలా దూకి
మట్టి మీద ఉన్న
చిన్ని చీమనూ పలకరించింది..
నదీ ప్రవాహాన్ని
ఉత్సాహపరిచింది వాన..
వానలో ఇంటికి
చేరాలనే ఆత్రుతతో పరిగెడుతున్న..
తను వాన నీరుని
తన దోసిట్లోకి తీసుకొని
గొంతును తడుపుకున్నాడు..
ఆ నీరు రుచి ఎంతో తీపి..
ఓ అమ్మాయి తన కురులని సరిచేసుకుంటూ
వాన కింద చేయిపెట్టి ఆడుకుంటోంది
వాన ఆ అమ్మాయికి
ఎంతో ఆనందాన్ని ఇస్తోంది..
కానీ ఇదే వాన ఒకరికి వరదై కూర్చుంది..


చిన్మయి ప్రకాష్‌
విపియస్‌పియస్‌ సిద్ధార్థ, విజయవాడ