పొదలకూరు :రాష్ట్ర ప్రజల ను మళ్లీ మోసం చేసేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధమవుతున్నాడని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. మండలంలోని తాటిపర్తి గురువారం జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. జెడ్‌పిటిసి తెనాలి నిర్మలమ్మ వైసిపి నాయకులు గోగిరెడ్డి గోపాల్ రెడ్డి, పి. పోల్ రెడ్డి, కే. చిన్న బ్రహ్మయ్య ఉన్నారు.
నెల్లూరు నగర నియోజకవర్గం పరిధిలోని 9, 51 వ డివిజనుల్లో, రూరల్ నియోజ కవర్గం పరిధిలోని 21, 32, 33 వ డివిజన్లులో జగనన్న సురక్ష కార్యక్రమాలు జరిగాయి. ఎంఎల్‌ఎ అనిల్ కుమార్ యాదవ్, కమిషనర్ పాల్గొన్నారు.
తోటపల్లిగూడూరు :ప్రజల సంక్షేమమే జగనన్న సురక్ష కార్యక్రమ లక్ష్యమని ఎంపిడిఒ కన్నం హేమలత తెలిపారు. గురువారం మండలంలోని వరిగొండలో జగనన్న సురక్ష కార్యక్రమం జరిగింది .ఎంపిడిఒ మాట్లాడుతూ జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా వివిధ రకాల ధ్రువపత్రాలు ఉ చితంగా అందజేస్తున్నట్లు చెప్పారు. వైసిపి నాయకులు, ప్రతి నిధులు తహశీల్దార్ హమీద్, ఇఓపిఆర్డి నారాయణ రెడ్డి, ఉన్నారు.
కందుకూరు : ప్రభుత్వం ప్రజల అవసరాలను వాలంటీర్ల ద్వారా గుర్తించి ఉచితంగా 11 రకాల సర్టిఫికెట్లను అందజే యడం వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగు తుందని సబ్ కలెక్టర్ శోభిక అన్నారు. వలేటివారిపాలెం మండలంలోని కొండ సముద్రం సచివాల యంలో సర్పంచ్ మన్నం వెంగమ్మ అధ్యక్షతన జగనన్న సురక్ష కార్యక్రమం గురువారం నిర్వహించారు. సర్పంచ్ మన్నం వెంగమ్మ, గ్రామ సచివాలయ కోకన్వీనర్ మన్నం వెంకట రమేష్ మాట్లాడారు .జెడ్‌పిటిసి ఇంటూరి భారతి ఎంపీపీ పోనుగోటి మౌనిక తహశీల్దార్ సుందరమ్మ ఎంపిడిఒ రపిక్ అహ్మద్ ఎంపిటిసి చింతలపూడి రవీంద్ర ఉన్నారు.










