Jul 12,2023 21:37

ప్రజాశక్తి - కైకలూరు
          పర్యావరణ పరిరక్షణకు, భావితరాలకు సంపూర్ణమైన వాతావరణం అందించేందుకు, వాతావరణ కాలుష్య నివారణకు ప్లాస్టిక్‌ వస్తువులను నివారిద్దాం-పేపర్‌ బ్యాగులను వినియోగిద్దాం అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్‌పి శ్రీమతి డి.మేరీప్రశాంతి ఐపిఎస్‌ ఆదేశాల మేరకు ఏలూరు డిఎస్‌పి శ్రీనివాసరావు సూచనలపై కైకలూరు ఇన్స్‌పెక్టర్‌ ఆకుల రఘు, కైకలూరు పోలీస్‌ సిబ్బంది, రవీంద్ర భారతి స్కూల్‌ విద్యార్థులతో కలిసి బుధవారం ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్‌ సిబ్బంది, ప్రిన్సిపాల్‌ శ్యామల పాల్గొన్నారు.