Dec 31,2022 00:11

జివిఎంసి అధికారులతో మాట్లాడుతున్న వ్యాపారస్తులు

ప్రజాశక్తి -ఆనందపురం :స్థానిక పూల మార్కెట్‌లో ప్లాస్టిక్‌ సంచుల వాడకంపై శుక్రవారం జివిఎంసి అధికారులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. నిషేధం అమల్లో ఉన్నప్పటికీ వ్యాపారస్తుల దగ్గర ప్లాస్టిక్‌ కవర్లు ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేసి స్వాధీనం చేసుకున్నారు. పూలతో కవర్లను చించి పడేశారు. ప్లాస్టిక్‌ వాడకాన్ని అందరూ నిషేధించాలని, మరోసారి పట్టుబడితే షాప్‌లను సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. ఈసందర్భంగా పలువురు వ్యాపారులు స్పందిస్తూ, ప్లాస్టిక్‌ కవర్ల వినియోగంపై నిషేధించిన అధికారులు, ముందుగా వాటి తయారీ, అమ్మకాలపై నిఘాపెట్టి నియంత్రించాలని తమ ఆవేదనను వెలిబుచ్చారు.