Nov 28,2022 23:48

మాట్లాడుతున్న ఎంపిడిఒ వీర కిశోర్‌

ప్రజాశక్తి-మారేడుమిల్లి
గ్రామాల్లో పాస్టిక్‌ వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో వీర కిషోర్‌ హెచ్చరించారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో సర్పంచ్‌ కొండా జాకబ్‌ అధ్యక్షతన గ్రామంలోని షాపులు, హోటల్స్‌, గెస్ట్‌ హౌస్‌ యాజమాన్యులతో సోమవారం ప్లాస్టిక్‌పై అవగహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ప్రతి దుకాణం ముందు చెత్తతోట్టేలను తప్పక వాడాలన్నారు. షాపులు, హోటళ్లలో ప్లాస్టిక్‌ వినియోగించవద్దని, అమ్మవద్దని తెలిపారు. నిబంధనలు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుని, రూ.2వేలు నుంచి రూ.5వేలు వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. మెయిన్‌ రోడ్డులోని ఆర్‌ అండ్‌ బి స్థలాలలో నిర్మించిన అక్రమ కట్టడాలను ఎవరికి వారు సొంతంగా తొలగించాలన్నారు. లేకుంటే నోటీసులు జారీ చేసి తామే తొలగించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్‌ సర్పంచ్‌ బొడ్డేటి వీరబాబు పలువరు, వ్యాపారస్తులు పాల్గొన్నారు..