Jul 03,2023 23:53

తెనాలి: ప్రజా చైతన్యం కోసం ప్లాస్టిక్‌ నిషేధం అవశ్యకతను వివ రిస్తూ మారిస్‌ పేట యన్‌ సి ఆర్‌ యన్‌ యమ్‌ హైస్కూలు ఎస్‌సి సి ఎయిర్‌ వింగ్‌ విద్యార్థులు ఫ్ల కార్డులు చేతబూని సోమవారం పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. ఎన్‌సిసి ఉపాధ్యాయులు పి .భాస్కరరావు నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత వేజళ్ల ఉమా మహేశ్వర్‌ ప్రదర్శనలో పాల్గొని ప్లాస్టిక్‌ వాడకం వలన నష్టాలను వివరించారు. సంచుల తయారీలో ఉపయోగించే కాడ్మియం, సీసం వంటి విషపూరిత రసాయనాలు ఆహార పదార్థాలను కలు షితం చేస్తాయని చెప్పారు. కాడ్మియం వలన వాంతులు, గుండె పరిమాణం పెద్దది కావడం జరుగుతుందని, ఎక్కువ కాలం సీసానికి గురైతే, మెదడులోని కణాలు క్షీణించి పోతాయని వివరించారు.వేజళ్ల వెంకట సుబ్బారావు మెమో రియల్‌ ఎడ్యుకేష నల్‌ ట్రస్టు ద్వారా 800 చేతి గుడ్డ సంచులను తయారు చేయిం చి, ఎన్‌సిసి విద్యార్థుల ద్వారా పట్టణ ప్రజలకు ఉచితంగా అంద జేశారు.